ప్రేమించలేదని కొట్టి, కాళ్ళు పట్టుకోబోయాడు, ఎక్కడ? (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ఫిలిబిత్: మహిళలపై రక్షణ లేకుండా పోతోంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ బాలికపై ఓ యువకుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ లో చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ ప్రాంతంలో ఓ ఆకతాయి తనను ప్రేమించాలంటూ ఓ అమ్మాయిని బలవంతపెట్టాడు. అందుకు ఆమె అంగీకరించలేదు.

తన ప్రేమను నిరాకరించందనే కోపంతో ఆ ఆకతాయి ఆ యువతిపై వరుసగా ఐదుసార్లు బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో యువతి వద్దంటూ అరిచింది.

ఇంతలో అక్కడకు మరో యువతి స్కూటర్ పై రావడంతో అతడు తన దాడిని ఆపేశాడు. ఆ తర్వాత తాను కొట్టినందకు క్షమించాలంటూ ప్రాధేయపడ్డాడు.

అంతేకాదు కాళ్ళు పట్టుకోబోయాడు. కానీ, అతడి క్రూరత్వాన్ని కళ్ళారాచూసిన ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. స్కూటర్ పై అక్కడకు వచ్చిన యువతి ఇదంతా గమనించి దాడికి గురైన బాధితురాలిని చేయిపట్టుకొని తన వెంట తీసుకెళ్ళింది. ఈ తతంగమంతా సిసిటీవి కెమెరాల్లో రికార్డైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a youth assaulted a girl in broad daylight in Uttar Pradesh's Pilibhit area.The youth was enraged as the girl reportedly rejected his love proposal.
Please Wait while comments are loading...