బాలికపై రేప్ చేసిన వ్యక్తిని నగ్నంగా ఊరేగించారు, విచారణ
ముంబై: బాలిక మీద అత్యాచారం చేసిన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర జిల్లా వాంబోరి గ్రామంలో జరిగింది. వాంబోరి గ్రామంలో నివాసం ఉంటున్న శుభం భారాడియా (19) అనే కామాంధుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
వాంబోరి గ్రామంలో నివాసం ఉంటున్న 15 సంవత్సరాల బాలిక మీద శుభం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. మరోసారి బాలిక మీద అత్యాచారానికి ప్రయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు గుర్తించి, అతనిని పట్టుకున్నారు.

అతనికి దేహశుద్ది చేశారు. అతనిని నగ్నంగా తయారు చేసి గాడిద మీద కుర్చొపెట్టి గ్రామంలో ఊరేగించారు. అనంతరంకామాంధుడిని బింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ గోరక్ గంగూర్డేకి అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
యువకుడిని గాడిద మీద ఊరిగిస్తున్న సమయంలో అతను నగ్నంగా ఉన్నాడని ఆ క్లిప్పగింగ్‌లు మొబైల్‌లో చిత్రీకరించారని, యువకుడి మీద దాడి చేశారని.. గ్రామస్తుల పైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో 17 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని బింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ గోరక్ గంగూర్డే తెలిపారు.












Click it and Unblock the Notifications