తుపాకితో బెదిరించి 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా బొపారా గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు 15 ఏళ్ల బాలికపై తుపాకితో బెదిరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బిదెరించాడు.

జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు వివరించింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించామని, అయితే అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

ఆమె సోదరుడికి రాత్రి పూట భోజనం పెట్టి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి ఆ సంఘటన జరిగింది. యువకుడు వచ్చి అమ్మాయిని సమీపంలోని ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.

Youth rapes minor girl at gun-point

రెండు రోజుల క్రితం నలుగురు యువకులు కాలేజీకి వెళ్తున్న ఓ యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో జరిగిన విషయం తెలిసిందే ఆమె పైన చెరుకు తోటలో ఘాతుకానికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో పెడతామని హెచ్చరించారు. అగ్రాలో ఓ మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.

ఈ నిందితులు అత్యాచారాల సంఘటనను వీడియో తీశారు. వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను వాట్సప్, యూట్యూబ్ ద్వారా అప్ లోడ్ చేసి తమ మరింత క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. అగ్రాలో జరిగిన ఘటన జనవరి 15న జరిగింది. అయితే, వారు బెదిరించడంతో ఆ మైనర్ బాలిక వారం రోజుల పాటు పెదవి విప్పలేదు.

పదిహేనేళ్ల ఆ మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు మంగళవారం నాడు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తమ తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో నిందితులు తమ ఇంటిలోకి వచ్చి తన పైన అత్యాచారానికి పాల్పడ్డారని, దానిని వీడియో తీశారని చెప్పింది. అనంతరం వాటిని యూట్యూబ్, వాట్సప్ ద్వారా అప్ లోడ్ చేశారని చెప్పింది.

ముగ్గురు నిందితులను నరేష్, జైవీర్, రాజేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు బెదిరించడంతో కొద్ది రోజుల పాటు బాలిక మౌనంగా ఉందని, అయితే, పక్కింటి వారు ఇందుకు సంబంధించిన వీడియోను నెట్లో చూసి చెప్పడంతో ఆ తండ్రికి తెలిసిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+