YouTuber Jeetu Jaan అరెస్ట్: ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా భార్య..శరీరంపై ఆ గుర్తులు
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన యూట్యూబ్ ఆర్టిస్ట్ జితేంద్ర అలియాస్ జీతూజాన్ భార్య కోమల్ అగర్వాల్ ఆత్మహత్యకేసు.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో భర్తే ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని భండూప్ పోలీసులు అతణ్నిఅరెస్ట్ చేశారు. కోమల్ హత్యకేసులో యూట్యూబర్ జీతూజాన్ ప్రమేయం ఉందని నిర్ధారించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోమల్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. ఆ దిశగా ఆమెను ప్రేరింపించేలా చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తోన్నారు.

ఆత్మహత్య చేసుకున్నా..
జీతూ చిత్రహింసకు గురి చేయడంతో కోమల్ ఆత్మహత్యకు పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ.యూట్యూబ్ ఆర్టిస్ట్ జితేంద్ర. తన భార్య కోమల్ అగర్వాల్‌తో కలిసి భండూప్ ప్రాంతంలో నివసిస్తుండే వాడు. కిందటి నెల 27వ తేదీన కోమల్ అగర్వాల్ తన నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. ఆమెది ఆత్మహత్యగా భావించారంతా. ఆ దిశగానే భండూప్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కోమల్ అగర్వాల్ చెల్లెలు ప్రియా, తల్లి పోలీసులను ఆశ్రయించారు.

టార్చర్ తట్టుకోలేకే బలవన్మరణం..
రోజూ అతను కోమల్‌ను చిత్రహింసలకు గురి చేసేవాడని ఫిర్యాదు చేశారు. అతను పెట్టే టార్చర్‌ను తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జీతూపై ఐపీసీలోని 304, 323, 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మార్చి 4వ తేదీన కోమల్ అగర్వాల్.. జీతూ జాన్‌తో కలిసి ముంబైకి పారిపోయి వచ్చారని, నెల రోజుల తరువాత తొలిసారిగా ఆమె తమకు ఫోన్ చేసినట్లు ఆమె చెల్లెలు ప్రియా తెలిపారు.

ఫోన్ కూడా బంద్..
జీతూ తనను రోజూ దారుణంగా కొట్టేవాడని ఫోన్ ద్వారా చెబుతుండేదని పోలీసులకు వివరించారు. తాను ఆత్మహత్య చేసుకుంటే.. దానికి జీతూ జాన్ కారణమౌతాడని కూడా కోమల్ తమతో చెప్పిందని ఆమె తల్లి షీలా పాఠక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జీతూ టార్చర్‌కు తట్టుకోలేక కొద్దిరోజుల తరువాత కోమల్ తమకు ఫోన్ చేయడం కూడా మానేసిందని అన్నారు. ఈ ఫిర్యాదు మేరకు తాము జీతు జాన్‌ను అరెస్ట్ చేసినట్లు భండూప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ షిండే తెలిపారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..
కోమల్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకోవడానికి నిందితుడు ప్రేరేపించినట్లుగా తాము భావిస్తున్నామని అన్నారు. మృతురాలి తల్లి షీలా పాఠక్, చెల్లెలు ప్రియా ఇచ్చిన ఫిర్యాదులపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన తరువాతే.. అతనిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తాము పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. దీని తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications