వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Raghu rama: అమ్మతో రాజీనామా..? విజయమ్మ రిజైన్‌పై రఘురామ

|
Google Oneindia TeluguNews

వైసీపీ గౌరవ అధ్యక్ష పదవీకి విజయమ్మ రాజీనామా అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విపక్షాలు అయితే దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒక్కొ పార్టీ నుంచి నేతలు విరుచుకుపడుతున్నారు. స్వపక్షంలో విపక్షంలా మెలుగుతున్న రఘురామ కృష్ణ రాజు కూడా స్పందించారు. ఢిల్లీ నుంచే తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇదీ ఊహించిందే అని చెప్పారు.

 వీడ్కోలు సభలా..

వీడ్కోలు సభలా..


వైసీపీ ప్లీనరీ సమావేశం విజయలక్ష్మి వీడ్కోలు సభలా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామా అని అందరూ అడుగుతున్నారని తెలిపారు. విజయమ్మ రాజీనామా చేస్తారని తాను ముందే చెప్పానన్నారు. అమ్మ రాజీనామా కరెక్ట్‌... అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్ అని కామెంట్ చేశారు. ఎక్కడైనా గౌరవాధ్యక్షులకు పెద్ద పీట వేస్తారని గుర్తుచేశారు. వైసీపీలో మాత్రం పెద్ద కుర్చీలో సీఎం, చిన్న కుర్చీలో గౌరవాధ్యక్షులు ఉన్నారని తెలిపారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేస్తే తగిన గౌరవం దక్కేదని తెలిపారు.

దేహి అంటూ తిరిగితే..

దేహి అంటూ తిరిగితే..


జగన్ జైలులో ఉన్నప్పుడు దేహి అంటూ విజయలక్ష్మి తిరిగారని రఘురామ గుర్తుచేశారు. కొడుకు బెయిల్ కోసం విజయలక్ష్మి సోనియా కాళ్లు పట్టుకున్నారని సమాచారం ఉందన్నారు. ప్లీనరీలో జగన్ చెప్పినవేవీ చేయలేదని విజయలక్ష్మి చెబుతాన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ కుదరదని, జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా అని చెప్పుకొచ్చారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ ఉండదన్నారు. తాను కూడా పార్టీలో సభ్యుడిగా ఉన్నాట్లు తెలిపారు.

కోర్టుకు వెళతా

కోర్టుకు వెళతా


పార్టీ అధ్యక్షుడికి ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవీలో ఐదేళ్లు మాత్రమే ఉండాలని చెప్పారు. ఇదీ కరెక్ట్ కాదని చెప్పారు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళతానని తెలిపారు. శాశ్వత అధ్యక్షుడి అంశంపై కోర్టే తెలుస్తోందని చెప్పారు. భోజనాల ఖర్చు ఒకరిది, బియ్యం ఖర్చు ఒకరిది ప్లీనరీ వలన పార్టీకి లాభమే... నష్టం లేదని రఘురామ ఎద్దేవా చేశారు.

English summary
ysrcp mp Raghu rama krishna raju reacts on vijayamma resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X