బ్లాక్ లో తిరుమల టికెట్లు అమ్ముకున్న ముస్లిం ఎమ్మెల్సీ! వైసీపీ వీడి టీడీపీలో చేరినా..
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, తాజాగా టీడీపీలో చేరిన కడప జిల్లా ముస్లిం మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానం ఓ వివాదంలో చిక్కుకున్నారు. అధికారంలో ఉండగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆమెతో పాటు ఆమె పీఆర్వోను సైతం నిందితులుగా చేర్చారు. తాజాగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
తిరుమల దర్శనం వీఐపీ టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు 6 టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం అమ్ముకున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. దీంతో టీటీడీ విజిలెన్స్ దీనిపై ప్రాథమిక విచారణ జరిపింది. అందులో వాస్తవం ఉన్నట్లు తేలింది.

దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తిరుపతి పోలీసులకు జకియా ఖానంతో పాటు ఇలా టికెట్లు బ్లాక్ లో అమ్మడానికి కారకులైన వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై కేసు నమోదు చేసి ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేసి ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మరోవైపు తిరుమలలో వీఐపీ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ జకియా ఖానంతో వైయస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని అనవసరంగా వైయస్సార్‌సీపీకి అంటగట్టేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైయస్సార్‌సీపీలో లేరని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలోకి వెళ్ళిందన్నారు. అంతేకాక పలు సందర్భాలలో మంత్రి లోకేష్‌తో భేటీ అయిన విషయం గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications