Karnataka Exit Polls : కాంగ్రెస్ కే పట్టం కట్టిన జీ న్యూస్ ఎగ్జిట్ పోల్- 103-118 సీట్లకు అవకాశం..
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే క్యూలో ఉన్న వారికి సైతం ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 65.69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ముగియడంతో సర్వే సంస్ధలు ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటిస్తున్నాయి.
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇందులో 113 సీట్ల మ్యాజిక్ మార్క్ అందుకున్న వారికే అధికారం దక్కబోతోంది. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీకి 103-118 స్ధానాలు లభించే అవకాశమున్నట్లు తేలింది. అలాగే బీజేపీకి 79-94 స్ధానాలు లభించనున్నాయి. జేడీఎస్ కు 25-33 స్ధానాలు లభిస్తాయని జీన్యూస్ పోల్ పేర్కొంది. అలాగే ఇతరులకు 2 నుంచి 5 స్ధానాలు లభించనున్నట్లు తేలింది.

గతంలో మార్చి నెలలో జీన్యూస్-మ్యాట్రిట్జ్ ఇచ్చిన ఒపీనియన్ పోల్స్ లో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వెల్లడించింది. మార్చి 3న విడుదల చేసిన ఒపీనియన్ పోల్ లో బీజేపీ 96-106 సీట్లు గెల్చుకుంటుందని తెలిపింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 88-98 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇప్పుడు మాత్రం జీన్యూస్ సర్వేలో ఫలితాలు పూర్తిగా తలకిందులయ్యాయి. వాస్తవానికి కర్నాటకలో ప్రధాని మోడీ ప్రచారం తర్వాత బీజేపీ పుంజుకుందని పలు సర్వేలు చెప్తుండగా.. జీ న్యూస్ మాత్రం కాంగ్రెస్ కే పట్టం కట్టడం విశేషం.












Click it and Unblock the Notifications