G20 summit: ఆ మూడు రోజులు జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో బంద్..
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సదస్సుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. అగ్రరాజ్య దేశాల అధినేతలు హాజరకాబోతున్న ఈ సదస్సుకు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 80 వేల మంది ఢిల్లీ పోలీసులతో పాటు 1,30, 000 మంది భద్రతా సిబ్బంది రక్షణ విధులు నిర్వహించనున్నారు.
సదస్సు జరుగుతున్నప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా అత్యంత భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో పలు చోట్ల ఆంక్షాలు కూడా విధించారు. దేశంలో ఇప్పటికే క్లౌడ్ కిచెన్లు, డెలివరీ సేవలకు అనుమతి ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను సైతం నిషేధించనున్నారు. బ్లింకిట్, జెప్టో.. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలకు అనుమతి లేదు. ఈ మూడు రోజులు ఎలాంటి డెలవరీలకు అవకాశం ఉండదు.

ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఢిల్లీలోకి ఇతర వాహనాలను కూడా అనుమతించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉండనుంది. మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ ఉంటుందని అధికారులు చెప్పారు. వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 8, 9,10 తేదీల్లో ఢిల్లీలో ప్రభుత్వ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ఇచ్చారు. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 8 శుక్రవారం ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications