వార్నీ.. బతికున్నా వేస్టా? 110 కోట్ల మందికి గుర్తింపే లేదు, ఇక్కడా మనమే ఫస్ట్?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఏ గుర్తింపునకూ నోచుకోని వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 110 కోట్లు. వీరిలో మూడో వంతు చిన్నారులే ఉన్నారట. విచిత్రమేమిటంటే.. 21 కోట్ల మందితో మన దేశం ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండడం.

వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ఐడెంటిఫికేషన్ ఫర్ డెవలప్‌మెంట్ (ఐడీ4డీ) కార్యక్రమం చేపట్టిన సర్వే వివరాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మన దేశ జనాభాలో దాదాపు 16 శాతం మందికి నేటికీ ఏ గుర్తింపూ లేదట.

ఏ గుర్తింపు కార్డూ లేకుంటే ఎలా?

ఏ గుర్తింపు కార్డూ లేకుంటే ఎలా?

ఆధార్ కార్డు.. ఓటర్ ఐడీ.. రేషన్‌కార్డు.. పాస్‌పోర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్.. ఇలాంటివన్నీ అధికారికంగా మన అస్తిత్వాన్ని నిరూపించే గుర్తింపు కార్డులు. వీటిని ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా పిలుస్తుంటారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు మనకు చేరాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. మరి వీటిలో ఒక్కటీ లేకుంటే? మనిషిగా పుట్టి, పెరుగుతున్నా ప్రభుత్వానికి తెలియకుంటే?.. వారంతా గుర్తింపులేని వ్యక్తుల కిందే లెక్క.

నైజీరియా.. మరీ ఘోరం..

నైజీరియా.. మరీ ఘోరం..

ఏ గుర్తింపు కార్డు లేని వ్యక్తులు మనదేశంలో 21 కోట్ల మంది ఉన్నారట. అంటే మన జనాభాలో దాదాపు 16 శాతం మంది. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్ లో అయితే 42.5 శాతం మంది గుర్తింపు లేకుండా బతికేస్తున్నారు. నైజీరియాలో ఏకంగా 77 శాతం మంది జనాభాకు గుర్తింపు కార్డులే లేవట. వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ఐడెంటిఫికేషన్ ఫర్ డెవలప్‌మెంట్ (ఐడీ4డీ) కార్యక్రమం చేపట్టిన సర్వే వెల్లడించిన కఠోర సత్యాలివి. ప్రపంచవ్యాప్తంగా ఏ గుర్తింపునకూ నోచుకోనివారు 110 కోట్ల మంది ఉండగా, వారిలో మూడోవంతు చిన్నారులే. ఈ జాబితాలో మన భారత దేశం మొదటిస్థానంలో ఉండడం గమనార్హం.

 కారణాలు ఇవీ...

కారణాలు ఇవీ...

అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల్లో చాలామంది గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఇలాంటి వారు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు. దట్టమైన అరణ్యాల్లో ఎంతమంది నివసిస్తున్నారో ఆయా దేశాల ప్రభుత్వాల వద్ద ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు. ఉదాహరణకు ఆఫ్రికాలోని అమేజాన్ అడవుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే ఐదురోజులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. ఆయా చోట్లకు ప్రభుత్వాధికారులు వెళ్లలేరు. చాలా కుటుంబాలు తమ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లల వివరాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు.

దాచిపెడుతున్నారు...

దాచిపెడుతున్నారు...

ఒక ప్రాంతంపై ప్రభుత్వం రాజకీయంగా వివక్ష చూపడం లేదా ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేస్తుండడం వంటి సందర్భాల్లో పుట్టుకను రహస్యంగా ఉంచుతున్నారు.
అక్రమంగా వలస వచ్చినవారు కొన్నేండ్లపాటు గుర్తింపునకు దూరంగా ఉంటున్నారు.
లైంగిక దాడుల బాధితులు, పెండ్లికాకముందే గర్భం ధరించినవారు, లింగవివక్ష కారణంగా పుట్టే పిల్లలను రోడ్లపై వదిలేస్తున్నారు. ఇలాంటివారిలో చాలా మందికి గుర్తింపు దక్కడం లేదు. చైనాలో ఒకే బిడ్డ విధానం అమలులో ఉన్నప్పుడు.. ప్రభుత్వ శిక్ష నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ గుర్తింపును దాచిపెట్టారు.

మూడో వంతు.. ఆ మూడు దేశాల్లోనే...

మూడో వంతు.. ఆ మూడు దేశాల్లోనే...

సర్వే వివరాల ప్రకారం... గుర్తింపు లేని వారికి ప్రాథమిక హక్కులు అందడం లేదు. వారు విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదు. పేదరికం, వివక్ష, అంటువ్యాధులు, నియంతృత్వం, అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోనే ఎక్కువమంది అధికారిక గుర్తింపునకు దూరంగా ఉంటున్నారు. జనన ధ్రువీకరణ పత్రంపై ప్రపంచంలోని అధికశాతం మంది జనాభాకు అవగాహన లేదు. దీంతో ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కోట్ల మంది చిన్నారులకు బడుల్లో చేరినప్పుడు మాత్రమే గుర్తింపు వస్తోంది. ఒకవేళ వారు బడికి వెళ్లకపోతే ఓటువేసే వయసు వచ్చే వరకు అధికారికంగా అస్తిత్వం లేనట్టే. యూనిసెఫ్-2013 నివేదిక ప్రకారం.. గుర్తింపు లేని పిల్లల్లో కొందరు నేరస్థులుగా మారుతుండగా, మరికొందరు బానిసలుగా మారుతున్నారు. బాలికల్లో చాలామంది బలవంతంగా వ్యభిచారకూపాల్లో చిక్కుకుంటున్నారు. మరోవైపు బాల్యవివాహాల సంఖ్య కూడా పెరుగుతోంది. అసలు గుర్తింపు అంటూ లేని వారిలో మూడో వంతు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనే (దాదాపు 34 కోట్లు) ఉన్నారు.

టెక్నాలజీ సాయంతో...

టెక్నాలజీ సాయంతో...

గుర్తింపు లేని వారికి అధికారిక గుర్తింపు కార్డు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం సహాయం తీసుకోవాలనేది నిపుణుల సూచన. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ యంత్రాలు వంటి చిన్న పరికరాల సాయంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వొచ్చు. ఇందుకు 2005లో ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ చేపట్టిన ‘ఎవ్రీ చైల్డ్ కౌంట్స్ ' కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సంస్థ సభ్యులు డిజిటల్ టెక్నాలజీ, ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో 32 దేశాల్లో 4 కోట్ల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఒక గ్రామంలోని సర్పంచి లేదా ఓ నాయకుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆ గ్రామంలో గుర్తింపు లేని వారి ఫొటో, వివరాలు, బయోమెట్రిక్ సాయంతో వేలిముద్రలను పంపిస్తారు. దీంతోవారికి గుర్తింపు కార్డు మంజూరవుతుంది. ఇప్పుడు మొబైల్ నెట్‌వర్క్ పరిధి కూడా బాగా విస్తరించింది. కాబట్టి ప్రభుత్వాలు తలుచుకుంటే ఈ గుర్తింపు కార్యక్రమాన్ని మరింత ప్రతిభావంతంగా చేపట్టవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
1.1 Billion People in the World are unable to prove their Identity. That is 1 in every 7 individuals. The majority live in Africa and Asia, and more than a third are under the age of 18. he World Bank Group’s Identification for Development (ID4D) initiative plays an essential role in helping countries move forward to achieve the Sustainable Development Goals and leave no one behind.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి