వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్బుతం: 9 గంటల్లోనే హై స్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణం, ఎక్కడంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: 9 గంటల వ్యవధిలోనే హై స్పీడ్ రైల్వే ట్రాక్‌ను నిర్మించి రికార్డ్‌ను సృష్టించారు. తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం తమకే చెల్లుతోందని మరోసారి చైనీయులు నిరూపించారు.

9 గంటల వ్యవధిలోనే గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ రైలుకు అనుగుణంగా హై స్పీడ్ రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో 1,500 మంది వర్కర్లు పాల్గొన్నారు. వీరికి అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడు రైళ్లను వినియోగించారు.

1,500 Chinese workers build railway for a new train station in just NINE HOURS

దక్షిణ చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్సులోని లొంగ్యాన్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు హైస్పీడ్‌ సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు హై స్పీడ్‌కు అనుగుణంగా రైల్వే ట్రాక్‌ను నిర్మించారు.

హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆదేశాలు జారీ కావడంతో కేవలం తొమ్మిది గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. కొత్తగా నిర్మించిన నాన్‌లాంగ్‌ రైల్వే లైనును మరో మూడు లైన్లకు అనుసంధానించారు. రైళ్ల సమాచారాన్ని చేరవేసే ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సిస్టంను సైతం అమర్చారు.

2018 చివర కల్లా 246 కిలోమీటర్ల మేర నాన్‌లాంగ్‌ రైల్వే లైనును విస్తరించాలని చైనా యోచిస్తోంది. ఇది పూర్తైతే ఈశాన్య చైనా నుంచి సెంట్రల్‌ చైనాకు ప్రయాణం సులభతరమవుతుంది.

English summary
Around 1,500 workers spent just nine hours paving the railway for a new train station in Fujian Province, southern China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X