గాలిలోనే ఢీకొన్న రెండు విమానాలు: షాపింగ్ మాల్‌పై కుప్పకూలాయి

Subscribe to Oneindia Telugu

మాంట్రియల్‌: గాలిలో ప్రయాణిస్తున్న రెండు చిన్న విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కెనడాలోని సౌత్ షోర్‌లో చోటుచేసుకుంది. కాగా, బిజీ షాపింగ్‌ ప్రాంతంపైనే ఈ రెండు విమానాలు ఢీకొనడంతో ప్రజలు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

ఈ విమానాలు సెయింట్‌ హుబెర్ట్‌ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాలు చాలా దగ్గరగా ఉన్నాయని ఓ విమానాన్ని ఎడమ వైపునకు తిరగాల్సిందిగా కంట్రోలర్‌ సూచించినట్లు టీవీఏ నెట్‌వర్క్‌ తెలిపింది.

'కేవలం 800 మీటర్ల దూరంలో మరో విమానం ఉంది.. మీరు వింటున్నారా?' అని కంట్రోలర్‌ పైలట్‌తో రెండోసారి కూడా అన్నట్లు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో తెలిసినట్లు టీవీఏ పేర్కొంది. అయితే, ఏ సమస్య వచ్చిందో గానీ, రెండు విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి.

1 dead after planes collide above shopping centre on Montreal's South Shore

కాగా, మాంట్రియల్‌కు 20కిలోమీటర్ల దూరంలోని సెయింట్‌-బ్రూనో మాల్‌ పైకప్పుపై ఓ విమానం కూలిపోగా, మరో విమానం పార్కింగ్‌ ప్రాంతంలో పడిపోయింది. ఈ ప్రాంతం షాపింగ్‌మాల్‌ ప్రధాన ద్వారానికి 20మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ప్రమాదంలో ఓ విమాన పైలట్‌ ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు.

జనావాసాల మధ్య విమానం కూలినప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరీ ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ రెండు విమానాలు సెస్సానా 152 ఎయిర్‌క్రాఫ్ట్స్‌. ఇవి సమీపంలోని కార్‌గెయిర్‌ ఫ్లైట్‌ స్కూల్‌కు చెందినవి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని కెనడా రవాణా భద్రత అథారిటీ అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 21-year-old man is dead and a 23-year-old man critically injured after two small Cessna 152 planes collided in mid-air over Saint-Bruno on Montreal's South Shore.
Please Wait while comments are loading...