చైనా భయానక కుట్ర: ఉగ్రవాదులకు నేరుగా సాయం -పట్టుబడ్డ 10 మంది గూఢచారులు -అనూహ్య ట్విస్ట్
నిత్యం విస్తరణవాద కాక్షతో రగిలిపోయే చైనా.. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తనతో సరిహద్దులు పంచుకునే 14 దేశాల నుంచి దాదాపు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అది చాలదన్నట్లు పొరుగుదేశాల వ్యవహారాల్లో అగ్గిరాజేసి, పక్కదేశాలు అంతకంతకూ ఇబ్బందులు పడేలా చేస్తున్నది. ప్రపంచం ముందు పలు మార్లు దోషిగా నిలబడ్డ డ్రాగన్ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. కాకుంటే ఈసారి తన పవర్ మొత్తాన్ని ఉపయోగించి చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ -ఒక్కొక్కరి నెత్తిన రూ.70వేల భారం -కాగ్ సంచలన రిపోర్టు -జగన్ సర్కార్ మౌనం

డ్రాగన్ కుట్ర బట్టయలు..
సుదీర్ఘ యుద్ధం, అనంతర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అఫ్గానిస్థాన్ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ 10 మంది చైనీస్ గూఢచారులు అడ్డంగా దొరికిపోయారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో గత డిసెంబరు 10 పట్టుబడిన ఆ 10 మంది చైనా గూఢచారులను నాటకీయ పరిణామాల మధ్య విడుదల చేశారు. చైనా చాకచక్యంగా నెరపిన దౌత్యం ఫలితంగా 10 మంది స్పైలను ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బీజింగ్ కు పంపారు. బాహ్యప్రపంచానికి తెలియకుండా చైనా గుట్టుగా చేసిన ఈ పని కాస్తా మీడియా ఎంట్రీతో బట్టబయలైంది.

భారీగా మారణాయుధాలతో దొరికారు..
గత డిసెంబరు 10న అఫ్గానిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ జరిపిన దాడుల్లో 10 మంది చైనీయులు పట్టుబడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నాయని, వీరంతా ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని అఫ్గాన్ ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి, తమ దేశంలో గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది. ఇందుకుగానూ చైనా క్షమాణ చెప్పాల్సిందేనని, లేదంటే నిందితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనిపై..

ఘనీ గరం గరం.. సలేహ్‌పై భారం..
చైనీస్ గూఢచారుల కేసు పరిశీలన బాధ్యతలను ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌కు అప్పగించాలని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నిర్ణయించారు. సలేహ్ గతంలో అఫ్గాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా పని చేసి ఉండటంతో ఈ మేరకు బాధ్యతలు ఇచ్చారు. అంతర్జాతీయ అంశాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో గూఢచారులపై చర్యలు తీసుకునే ముందు చైనాతో సంప్రదింపులు జరపాలని అఫ్గాన్ భావించింది. ఇదే అదనుగా భావించి, చైనీయులను విడుదల చేసేలా అఫ్గాన్ ప్రభుత్వాన్ని డ్రాగన్ ఒప్పించింది. అయితే, ఏ షరతుల మేరకు చైనీస్ గూఢచారుల్ని అఫ్గాన్ విడుదల చేసిందన్నది మాత్రం బయటకు రాలేదు. కాగా..

అమెరికా బైబై.. హుక్కానీకి చైనా దన్ను..
2001నాటి సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అఫ్గానిస్తాన్ పై యుద్ధానికి దిగిన అమెరికా.. పోరు ముగిసిన తర్వాత కూడా ఊబిలోనే కూరుకుపోయింది. గడిచిన దశాబ్దకాలంగా బలగాల అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఎట్టకేలకు ట్రంప్ కఠిన నిర్ణయాలతో అమెరికన్ సైన్యాలు దాదాపుగా వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే, అఫ్గాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ చేపట్టిన తర్వాత అక్కడ పట్టుకోసం చైనా ప్రయత్నిస్తోంది. గూఢచార, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపుతోంది. తాజాగా పట్టుబడిన 10 మంది చైనీస్ గూఢచారులకు ఉగ్రవాద సంస్థ హుక్కానీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకి