ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు: 10మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మంగళవారం భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సెంట్రల్ ఇస్తాంబుల్‌లోని చారిత్రక సుల్తాన్హామెట్ జిల్లాలోని ఓ కూడలి వద్ద ఈ పేలుడు సంభవించింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పర్యాటక కేంద్రం.

కాగా, ఎన్నో పర్యాటక ప్రాంతాలను కలిగి ఉండటంతో ఇస్తాంబుల్ ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బ్లూ మసీదు, హజియా సోఫియాకు సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.
పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే చారిత్రక స్మృతి చిహ్నమున్న పార్క్ కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications