ఈ బుడ్డోడు అదృష్టవంతుడు..బతికి బయటపడ్డాడు, ఎలాగో చూడండి

చైనా: చైనాలో ఓ 10నెలల బాలుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు దారిన పోయే వారు పోలీసులు. మొదటి అంతస్తులో ఉన్న ఇంటి నుంచి చిన్నగా దోగాడుతూ బాల్కనీవైపు వచ్చాడు బాలుడు. అక్కడి నుంచి బయట ఉన్న పవర్ కేబుల్‌పైకొచ్చాడు. అదే సమయంలో ఆ వీధిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. కేబుల్ వైర్లపై వ్రేలాడి ఉన్న బాలుడిని చూసింది. వెంటనే అక్కడే నడుచుకుంటూ వెళుతున్న మరో వ్యక్తిని పిలిచి బాలుడిని చూపించింది. ఆ వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు.

 10-month-old hanging on power cables saved by passers using rug

పోలీసులు చేరుకునేలోపు అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. బాలుడు కేబుల్ వైర్లపై నుంచి వేలాడుతున్నాడు. ఏ క్షణమైనా కిందపడిపోయే ఛాన్స్ ఉంది. సరైన సమయంలో స్పందించకుంటే బాబు ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు బాబు కేబుల్ వైర్లపైనే వేలాడుతూ ఉన్నాడు. అంతలోనే ముందుగా చూసిన ఓ మహిళకు మంచి ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న ఓ దుప్పటి తీసుకొచ్చింది. ఇక పోలీసులు ఆ దుప్పటి పట్టుకుని ఉన్నారు.

బాబు కాసేపు ఇటూ అటూ గాల్లోనే వేలాడాడు. కింద అంతా అలర్ట్‌గా దుప్పటి పట్టుకున్నారు. ఓవైపు తల్లిదండ్రులు కంగారుగా ఉన్నారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నారు. బిడ్డ మాత్రం ఇంకా గాల్లోనే వేలాడుతూ ఉన్నాడు. అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కొక్కరు కనురెప్ప వాల్చకుండా అంతా బాబు వైపే చూస్తున్నారు. ఇంతలోనే బాబు ఒక్కసారిగా కిందకు పడ్డాడు. పోలీసులు జాగ్రత్తగా దుప్పటిలో పట్టుకున్నాడు. ఎలాంటి గాయాలు తగల్లేదు. అంతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు, ముందుగా సమాచారం ఇచ్చిన మహిళకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ పోలీసులు తల్లిదండ్రులకు క్లాస్ పీకారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+