Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భీతావహం: కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, వీరిలో 12 మంది అమెరికన్ సైనికులు, 120మందికిపైగా తీవ్రగాయాలు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. 120 మందికిపైగా పౌరులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు అమెరికా సైనికులు ఉన్నారు.

మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఘటనా స్థలాలు హృదయవిదారకంగా మారాయి. కాగా, మొదట పేలుడు బారన్ హోటల్ వద్ద జరిగింది. ఆ తర్వాత రెండో పేలుడు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం అబ్బే గేట్ సమీపంలో చోటు చేసుకుంది.

 4 US marines among 40 killed, more than 120 injured in blasts outside Kabul airport

ఇతర దేశాలకు వెళ్లేందుకు వేలాది మంది విమానాశ్రయం ఆవరణలో వేచివున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారీ జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, తాలిబన్లు ఈ దాడికి పాల్పడలేదని అంటున్నారు. ఐఎస్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడివుంటారని తాలిబన్లు చెబుతుండటం గమనార్హం.

ఆగస్టు 31 వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయమే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించగా.. కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులకు దాడులకు దిగడం సంచలనంగా మారింది.

Recommended Video

    Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan

    పేలుళ్ల ఘటనతో ఆయా దేశాలు తమ పౌరులను వెంటనే తమ తమ దేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. భారత్ ఇప్పటికే 600 మందికిపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే, దీరిలో పలువురు ఆప్ఘాన్ పౌరులు కూడా ఉన్నారు. తాజాగా, మరో 140 మంది హిందువులు, సిక్కులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. గురువారం తాలిబన్లు అడ్డుకున్నారు. దీంతో వారు కాబూల్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరిని కూడా భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+