గ్యాంగ్‌రేప్: 12మంది నిందితులకు 140ఏళ్ల జైలు

లండన్‌: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు న్యాయస్థానం భారీ శిక్షలు విధించింది. దీంతో ఆ బాలికను అత్యంత కర్కశంగా గ్యాంగ్‌రేప్‌ చేసిన నిందితులు.. బతికున్నంత వరకు వారు జైలు జీవితమే గడపనున్నారు.

ఇంగ్లండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌ కోర్టు న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు. 2012వ సంవత్సరంలో లండన్‌కు చెందిన ఓ 13 ఏళ్ల బాలికను అపహరించింది ఓ విదేశీ ముఠా. అందులో 12 మంది పాకిస్థానీయులు, ఒక బంగ్లాదేశీయుడు ఉన్నారు.

12 men jailed for total of 140 years for rape and abuse of 13-year-old girl

బాధిత బాలికను కారులో పలుచోట్లకు తిప్పుతూ పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. చర్చి, స్మశాన వాటిక, సెల్లార్‌, కార్‌ పార్కింగ్‌ తదితర ప్రాంతాల్లో ఆమెను గ్యాంగ్‌‌రేప్‌ చేశారు. ఈ కేసు బ్రాడ్‌ఫోర్డ్‌ కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.

నేరం రుజువైనందున నిందితులందరికీ 140 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కాగా, వీరి గత జీవితం కూడా నేరమయమైనదేనని ప్రాసిక్యూటర్‌ వెల్లడించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అహ్మద్‌ అల్‌ చౌదరి ఈ ముఠాకు నాయకుడని, ఇతను బంగ్లాదేశ్‌లో ఎన్నో నేరాలు చేసి పరారై ఇక్కడకు వచ్చాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+