13 మంది మృతి.. పలువురికి గాయాలు: కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
కాల్పుల మోతతో మరోసారి అమెరికా దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో 13 మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాలిఫోర్నియాలో గల శాక్రమెంటో 10వ జే స్ట్రీట్స్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆదివారం వేకువజామున కాల్పులు జరిగాయి. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.
15 సెకన్లలో 50 రౌండ్ల కాల్పులు జరిగాయని పేర్కొన్నారు.ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. కాల్పులు ఎవరు జరిపారో.. కారణాలేంటో ఇంకా తెలియలేదు.

శనివారం సాయంత్రం వర్జీనియా మాల్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. గంటల తర్వాత ఇక్కడ కాల్పుల మోత మోగింది. రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో కాల్పులు జరిగిన తర్వాత అనేక మంది ప్రాణాలు కోల్పోయారని శాక్రమెంటోలోని పోలీసులు చెప్పారు. బాధితుల పరిస్థితి వెంటనే తెలియరాలేదని వివరించారు.
కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డౌన్ టౌన్ ఏరియాను మూసివేసి.. దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపింది తామేనని.. ఎవరూ ప్రకటించలేదు. ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉండే జనం మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications