వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘనిస్థాన్ లో 1500 మంది భారతీయుల ఆక్రందన : కేంద్రానికి వేడుకోలు, తరలింపుపై ఉత్కంఠ !!

|
Google Oneindia TeluguNews

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో సిక్కు మరియు హిందూ కుటుంబాలు ఆశ్రయం పొందినా తాజా పరిణామాలతో భయాందోళనలో ఉన్నారు. వారు ఆఫ్ఘనిస్థాన్ నుండి స్వదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సంబంధిత విషయాలను సమన్వయం చేయడానికి భారతదేశం ఒక సెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఆ సెల్ కు ఫోన్ చేసినా స్పందించటం లేదని భారతీయ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

షాకింగ్ : తాలిబన్లతో స్నేహానికి సిద్ధమన్న చైనా, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణంలోనూ ; బుద్ధి బయటపడిందిగా !!షాకింగ్ : తాలిబన్లతో స్నేహానికి సిద్ధమన్న చైనా, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణంలోనూ ; బుద్ధి బయటపడిందిగా !!

ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకున్న 1500మంది భారతీయ పౌరులు .. ప్రభుత్వానికి వేడుకోలు

ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకున్న 1500మంది భారతీయ పౌరులు .. ప్రభుత్వానికి వేడుకోలు


ఆగస్టు 5వ తేదీ నాటికి ఆఫ్ఘనిస్థాన్లో అధికారులతో సహా సుమారు 1500 మంది భారతీయులు ఉన్నట్టుగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఆసుపత్రులు, సెక్యూరిటీ కంపెనీ, యూనివర్సిటీలు, భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్ల లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ తమను భారత్ తీసుకువెళ్ళమని హాహాకారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వీరందరి తరలింపుపై ప్రస్తుతం భారతదేశంలో ఉత్కంఠ నెలకొంది. వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం చొరవ చూపాలని, తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.

హెల్ప్ లైన్ కు ఫోన్ చేసినా స్పందన లేదు .. కాపాడండి... భారతీయ కార్మికుల విజ్ఞప్తి

హెల్ప్ లైన్ కు ఫోన్ చేసినా స్పందన లేదు .. కాపాడండి... భారతీయ కార్మికుల విజ్ఞప్తి

అక్కడ ఉన్న కార్మికులు భయం గుప్పిట్లో బతుకుతున్నామని చెప్తున్నారు. తమ కుటుంబాలు ఏడుస్తున్నాయని, తాము ఇక్కడి నుండి బయటపడాలని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. తాము హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశాము, వారు ఇంకా సమాధానం ఇవ్వలేదు, కానీ ఆ సందేశాన్ని అందుకున్నారు" అని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .అయితే అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని "ఉన్నత స్థాయిలో నిరంతరం" పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్ సెల్ ఏర్పాటు .. అందరినీ తీసుకొస్తాం అన్న భారత్

ఆఫ్ఘనిస్థాన్ సెల్ ఏర్పాటు .. అందరినీ తీసుకొస్తాం అన్న భారత్

యుద్ధంలో చిక్కుకున్న దేశాన్ని విడిచి వెళ్లాలనుకునే సిక్కులు మరియు హిందువులను మాత్రమే కాదు భారతదేశం నుండి అక్కడికి వెళ్లి పని చేస్తున్న కార్మికులను సైతం స్వదేశానికి రప్పించేందుకు భారత్ సదుపాయం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి ప్రకటించారు. భారతదేశ పౌరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి స్వదేశానికి పంపడం మరియు ఇతర అభ్యర్థనలను సమన్వయం చేయడానికి భారత్ ప్రత్యేక ఆఫ్ఘనిస్తాన్ సెల్‌ను ఏర్పాటు చేసింది అని బాగ్చి ట్వీట్ చేశారు. బాగ్చి ఆఫ్ఘనిస్థాన్ సెల్ యొక్క సంప్రదింపు వివరాలను కూడా పోస్ట్ చేసారు. అంతేకాదు అక్కడ ఇంకా భారతీయులు ఉన్న విషయంపై స్పందించిన బాగ్చి వారందరినీ సురక్షితంగా తీసుకొస్తామని చెప్పారు.

భారత పౌరుల భద్రత పర్యవేక్షిస్తున్నాం , ఆఫ్ఘన్ల సహకారం కూడా ఉంది

భారత పౌరుల భద్రత పర్యవేక్షిస్తున్నాం , ఆఫ్ఘన్ల సహకారం కూడా ఉంది

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితిని ఉన్నత స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భారత పౌరుల భద్రత కోసం, ఆఫ్ఘనిస్తాన్‌లో పౌరుల ప్రయోజనాలను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బాగ్చి చెప్పారు. భారతదేశానికి సహకారం అందించడానికి, భారతీయుల ప్రయత్నాలను ప్రోత్సహించడంలో మా భాగస్వాములుగా అనేక మంది ఆఫ్ఘన్‌లు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో తాము వారికి అండగా ఉంటాము అని బాగ్చి చెప్పారు.ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (డిఎస్‌జిఎంసి) చీఫ్ మంజీందర్ సింగ్ సిర్సా సద్గురు సిక్కు మరియు హిందూ వర్గాల ప్రజలు కాబూల్‌లోని కార్తె పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందారని చెప్పారు.

అందరినీ భారత్ కు తీసుకొస్తాం .. భయపడాల్సిన పని లేదు

అందరినీ భారత్ కు తీసుకొస్తాం .. భయపడాల్సిన పని లేదు

తాను రాష్ట్రపతి, కాబూల్ మరియు సంగత్ గురుద్వారా కమిటీతో నిరంతరం టచ్‌లో ఉన్నానని , గజనీ మరియు జలాలాబాద్‌లో నివసిస్తున్న 320 మందికి పైగా మైనారిటీలు (50 మంది హిందువులు మరియు 270 మంది సిక్కులతో సహా) కాబూల్‌లోని కార్తె పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందారని తనకు చెప్పారని, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, వారిని భారత్ తీసుకువస్తామని సిర్సా అన్నారు.ఇదే సమయంలో తాలిబన్ నాయకులు వారిని కలుసుకున్నారని, వారి భద్రత గురించి వారికి హామీ ఇచ్చారని వెల్లడించారు.

ఆఫ్ఘనిస్థాన్ లో రాజకీయ సైనిక మార్పులు .. ఆందోళన వద్దు

ఆఫ్ఘనిస్థాన్ లో రాజకీయ సైనిక మార్పులు .. ఆందోళన వద్దు

ఆఫ్ఘనిస్తాన్‌లో రాజకీయ మరియు సైనిక మార్పులు జరుగుతున్నప్పటికీ హిందువులు మరియు సిక్కులు సురక్షితమైన జీవితాన్ని గడపగలరని మేము ఆశిస్తున్నాము అని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కుల భద్రతకు భరోసా ఇవ్వాలని మరియు భారతదేశానికి రావాలనుకునే వారిని తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని గురుద్వార అగ్రశ్రేణి శిరోమణి గురుద్వారా పరబంధక్ కమిటీ కోరింది. ఈ మేరకు ప్రభుత్వం సైతం ఏర్పాటు చేస్తుంది.తాలిబన్లు ఆదివారం కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో భయాందోళనలు గందరగోళాన్ని సృష్టించాయి.

భారత్ రావాలనుకునేవారికి ప్రభుత్వం భరోసా .. తరలింపు ఏర్పాట్లు

భారత్ రావాలనుకునేవారికి ప్రభుత్వం భరోసా .. తరలింపు ఏర్పాట్లు

సోమవారం, అధికారులు వేలాదిగా ప్రజలు కాబూల్ ఎయిర్పోర్టుకు వచ్చి, ఇతర దేశాలకు తరలిపోయే ప్రయత్నం చేయగా, పరిస్థితి అదుపు తప్పడంతో పౌర విమానాల కోసం ఆఫ్ఘన్ వైమానిక స్థలాన్ని మూసివేశారు . ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ఫీల్డ్‌ను సైనిక ఉపయోగం కోసం మాత్రమే అనుమతించారు. ఏదేమైనా, తాలిబన్ల చేతిలో చిక్కుకున్న దేశాన్ని విడిచి వెళ్ళడానికి చివరి ప్రయత్నంలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తాలిబన్ల ఆటవిక పాలనలో తాము జీవించలేమని తేల్చి చెబుతున్నారు. ఇక భారత్ ఆఫ్ఘన్ లో చిక్కుకున్న హిందువులు, సిక్కులకు, భారతీయ కార్మికులకు ఆపన్న హస్తం అందించడానికి, వారిని స్వదేశానికి తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్ సెల్ ను ఏర్పాటు చేసి తరలింపు మొదలు పెట్టింది భారత్.

English summary
Conditions are worse in Taliban-occupied Afghanistan. The cries of the people are echoing. Thousands of people have been desperately trying to flee the country since the Taliban seized control of the Afghan capital, Kabul, while Sikh and Hindu families and also indian workers total 1500 indians have sought refuge in Afghanistan, but are still reeling from the latest developments. India has set up a cell to coordinate relevant matters in the wake of their attempt to return home from Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X