వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 వేల కిలోల బాంబు, నడి సంద్రంలో పేల్చివేత.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు 18 వేల కిలోల బాంబును పేల్చివేశారు. అదీ భూమి మీదో.. ఆకాశంలో కాదు సముద్రంలో.. నడి సముద్రంలో జలచరాలు లేకుండా చూసి మరీ పేల్చారు. పర్యావరణానికి నష్టం కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అమెరికా తూర్పు తీరంలో పరీక్ష చేశామని అమెరికా నౌకాదళం ప్రకటించింది. కానీ ఆ వీడియో మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది.

18 వేల కిలోల పెద్ద బాంబు

18 వేల కిలోల పెద్ద బాంబు

18 వేల కిలోల పెద్ద బాంబును నడిసంద్రంలో పేలిస్తే ఎలా ఉంటుంది! ఆ నీళ్లు ఎంతెత్తుకు ఎగిసి పడాలి! దాని ప్రభావం ఎన్ని కిలోమీటర్లు ఉండాలి! దానిని అమెరికా నౌకాదళం టెస్ట్ చేసింది. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (సీవీఎన్78) నౌక పై నుంచి అట్లాంటిక్ మహా సముద్రంలో తొలి పేలుడు పరీక్షను నిర్వహించింది. 40 వేల పౌండ్ల (సుమారు 18,143 కిలోలు) బరువున్న బాంబును సముద్రం అడుగు భాగాన పేల్చింది. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్‌లో భాగంగా కొత్త నౌకలు బాంబు పేలుళ్ల ధాటికి ఎలా తట్టుకుంటాయో తెలుసుకునేందుకు, వాటి యుద్ధ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ఈ పరీక్షను నిర్వహించింది.

ప్రీకాషన్స్ తీసుకొని..

ప్రీకాషన్స్ తీసుకొని..

జలచరాలు, పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండానే అమెరికా తూర్పు తీరంలో పరీక్ష చేసినట్టు అమెరికా నౌకాదళం ప్రకటించింది. పేలుడు ధాటికి సముద్రంలో గల నీళ్లు అల్లంతెత్తుకు ఎగిసిపడ్డాయి. దాని తరంగాలు చాలా దూరం వరకు విస్తరించాయి. తీసిన వీడియో కూడా షేకయ్యింది. 10 నుంచి అంకెలు లెక్కబెట్టగానే పెద్దగా శబ్దం వచ్చింది. నీళ్లు పైకి ఎగిసి పడ్డాయి. ఆ శబ్దంతో భూకంపం వచ్చిందా అనే అనుమానం కలిగింది. కానీ తాము అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా నౌకాదళం ప్రకటించింది.

ఒళ్లు జలదరింపు..


పేలుడు తర్వాత నీరు పైకి వచ్చింది. అలల మాదిరిగా అక్కడ ఏర్పడ్డాయి. భారీగా శబ్దం వచ్చింది. అమెరికా నౌకాదళం షేర్ చేసిన వీడియో కూడా షేకయ్యింది. నౌకలపై దాడులను ఎదుర్కొనేందుకు చేసిన ఫీట్.. భయకంపితులను చేసింది. నిజంగా ఆ స్థాయిలో దాడి చేస్తే.. నౌకలు తట్టుకునేలా రూపొందించడం మంచిదే.. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తోంది.

English summary
18000 kilo bomb detonated in atlantic middle sea america navy clarify. this test was trial for new ships.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X