28 ఏళ్ల పిటిషన్‌ను 2 నిమిషాల్లో తోసిపుచ్చిన కోర్టు
ఢాకా: 28 ఏళ్ల పిటిషన్‌ను రెండు నిమిషాలలో తోసిపుచ్చడం ద్వారా బంగ్లాదేశ్ న్యాయస్థానం ఒకటి పిటిషన్‌దారులకు షాకిచ్చింది. నలుగురు సభ్యులతో కూడిన న్యాయస్థానం పదిహేను మంది వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషన్ వేసిన వారిలో చాలామంది ఇప్పుడు లేరు.
బతికు ఉన్న వారికి ఇప్పుడు కోర్టు షాకిచ్చింది. ఇరవై ఎనిమిదేళ్ల ఏళ్ల నాటి పిటిషన్‌ను రెండు నిమిషాల్లో కోర్టు తోసిపుచ్చడంపై పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
1971లో పాకిస్థాన్‌తో యుద్ధం అనంతరం స్వాతంత్య్రం సాధించిన బంగ్లాదేశ్‌ను లౌకిక రాజ్యంగా ప్రకటిస్తూ రాజ్యాంగం రూపొందింది. అయితే సంఖ్యా పరంగా ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఇస్లాం రాజ్యంగా మారుస్తూ 1988లో రాజ్యాంగాన్ని సవరించారు.

దానిని వ్యతిరేకిస్తూ పదిహేను మంది వ్యక్తులు అదే ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో చాలామంది చనిపోయారు. 2010లో లౌకికవాదాన్ని తిరిగి రాజ్యాంగంలో చేర్చినప్పటికీ స్టేట్ రెలిజియన్‌గా ఇస్లాంను అలాగే ఉంచారు. దీంతో ఇస్లాంను తొలగించాలంటూ వేసిన 28ఏళ్ల నాటి పిటిషన్‌ను తిరిగి దాఖలు చేశారు.
ఆ పిటిషన్ సోమవారం బంగ్లాదేశ్ హైకోర్టులో విచారణ వచ్చింది. అయితే, రెండు నిమిషాల్లోనే కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాదనలు వినకుండానే, మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే పిటిషన్‌ను కొట్టివేశారంటూ ఆవేదన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications