వైమానిక దాడి: 20మంది ఇండియన్స్ మృతి?
సనా: యెమెన్‌లో చమురు స్మగ్లర్లు, షియా ఉగ్రవాదులు లక్ష్యంగా సౌదీ అరేబియా మిత్రదేశాల కూటమి జరిపిన వైమానిక దాడిలో 20మంది భారతీయులు మృతి చెందినట్లు తెలిసింది. యెమెన్ పట్టణం అల్ హొదైదాహ్ ఓడరేవుపై మిత్రకూటమి విమానాలు మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది.
హొదైదాహ్ రేవు సమీపంలోని అల్ ఖోఖా ప్రాంతంలో జరిపిన దాడిలో భారతీయులు మరణించినట్లు స్థానికులు, మత్స్యకారులు తెలిపారు. ఈ దాడిలో రెండు పడవలు ధ్వంసమయ్యాయని, 12మంది షియా మిలిటెంట్లు కూడా చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

మంగళవారం యెమెన్‌లో సౌదీ విమానాలు 20 చోట్ల వైమానికి దాడులు చేసినట్లు తిరుగుబాటు సంస్థ హుతీ పేర్కొంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయినట్లు హుతీ మీడియా విభాగం ప్రకటించింది. సోమవారం కూడా వైమానిక దాడులు చేయటంతో 15 మంది చనిపోయారు.
కాగా, యెమెన్‌లో వైమానిక దాడిలో భారతీయులు మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగశాఖ తెలిపింది. వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తిరుగుబాటుదారుల విజృంభణ తర్వాత యెమెన్‌లో గత ఏప్రిల్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. భారత ప్రభుత్వం అనేకమంది భారతీయులను తిరిగి ఇండియాకు రప్పించింది. కాగా, కొందరు భారతీయులు అక్కడే ఉంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. వైమానికి దాడిలో 20మందిలో 13మంది భారతీయులు సజీవంగా బయటపడ్డారు. కాగా, మరో ఏడుగురి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications