వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 మంది సిక్కులు, ఎంబసీ స్టాప్ కూడా: ఐఏఎఫ్ ఎయిర్ క్రాప్ట్ ద్వారా తరలింపు..

|
Google Oneindia TeluguNews

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో.. అక్కడి ప్రజలకు తెలుసు.. ప్రపంచానికి కూడా తెలుసు. ఇక ఇక్కడ ఉండలేమని అనుకున్నారు. ఇంకేముంది స్వస్థలాలకు తరలివెళుతున్నారు. అయితే సరైన విమాన సౌకర్యాలు లేకపోవడం.. ఇతర సమస్యల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఓ గురుద్వారాలో 200 మంది సిక్కులు చిక్కుకున్నారని తెలుస్తోంది.

Recommended Video

Two people had tied themselves to US C-17 aircraft fell down | Oneindia Telugu
జై శంకర్‌కు కెప్టెన్ రిక్వెస్ట్

జై శంకర్‌కు కెప్టెన్ రిక్వెస్ట్

ఆప్ఘనిస్థాన్‌లో దిక్కుతోచని పరిస్థితిలో భారతీయులు కూడా ఉన్నారు. వారిని తక్షణమే వెనక్కి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. అమెరికన్ మిలటరీ విమానంలోకి భయంతో చొచ్చుకుపోయిన అక్కడి ప్రజానీకాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు కాల్పులు జరిపాయనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రికి కెప్టెన్ అమరీందర్ విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుని క్యూలు కట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే స్పందించిన అమరీందర్ సింగ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడంతో పాటు అక్కడి సిక్కులతో పాటు, భారతీయులను ఖాళీ చేయించి స్వదేశానికి రప్పించే విషయంలో చేతనైన సహాయాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పరిణామాలు ఎంతమాత్రం మంచివి కావన్నారు. సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కాబూల్‌లో ల్యాండ్

కాబూల్‌లో ల్యాండ్

మరోవైపు భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కాబూల్‌లో ల్యాండయ్యింది. ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం సోమవారం సాయంత్రం దిగింది. అక్కడ గల భారతీయులు, ఎంబసీ స్టాప్‌ను తీసుకొస్తారు. ఇవాళ ఉదయం తజకిస్తాన్‌లో విమానం ఆగాల్సి వచ్చింది. కాబూల్‌లో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా.. అక్కడే ఆగింది. అమెరికా దళాలు ఎయిర్ ఫీల్డ్ నియంత్రణ పొందిన తర్వాత.. దిగింది. అయితే కాబూల్‌లో 500 మంది వరకు భారతీయులు ఉన్నట్టు సమాచారం. వారిలో రాయబార కార్యాలయ సిబ్బంది, ఐటీబీపీ స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది.

శరద్ పవర్ రిక్వెస్ట్

శరద్ పవర్ రిక్వెస్ట్


ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకొన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై భారత్ ఆలోచించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. పాకిస్తాన్, చైనా తప్ప.. మిగతా దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇతర దేశాలతో విదేశాంగ విధానంపై సమీక్ష చేయాలని ఆయన సూచించారు. ఈ ఆపత్కాలంలో తాము ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పారు. ఇదీ జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని ఆయన చెప్పారు.

English summary
aircraft landed in Kabul around 5 pm on Monday to bring back Indians stranded in the country, including embassy staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X