గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...
ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్‌లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 25 మంది సిక్కులు చనిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాడి చేయడంతో.. భద్రతా సిబ్బంది కూడా ధీటుగానే స్పందించారు. కానీ పదుల సంఖ్యలో సిక్కులు మాత్రం నెలకొరిగారు. ఘటనా జరిగిన సమయంలో గురుద్వారాలో 150 మంది సిక్కులు ప్రార్థనలు చేస్తున్నారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు కొందరినీ కాపాడటంతో మృతుల సంఖ్య తగ్గింది. లేదంటే గురుద్వారా శవాలదిబ్బగా కనిపించేది.
కాబూల్‌గల షోర్ బజార్ వద్ద గల గురుద్వారా లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. కాల్పులు 25 మంది చనిపోగా, 8 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారికి ఆర్యన్ పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో సిక్కుల మైనారిటీ వర్గమని తెలిసిందే. ఇక్కడ ముస్లిం, సిక్కుల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతోంది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోన్న హక్కానీ గ్రూపు ప్రోద్బలంతో ఉగ్రవాద దాడి జిరగిందని ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఆస్రఫ్ గని ఆరోపించారు. కానీ దాడి జరిపింది తామేనని ఐఎస్ పేర్కొన్నదని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. గురుద్వారాపై దాడిని తాలిబాన్లు ఖండించారు. వాస్తవానికి అమెరికా-తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. కానీ ఆప్ఘనిస్తాన్‌లో మాత్రం హింస చెలరేగుతూనే ఉంది.

Recommended Video
కాబూల్‌లో గురుద్వారాపై ఉగ్రవాదుల దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. గురుద్వారాపై దాడి దేనికి సంకేతమని భారత పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్ లాంటి దేశంలో మైనార్టీ వర్గాలపై దాడి.. మత స్వేచ్చ హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications