Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్‌లో 3 వేల మంది విద్యార్థుల బందీ: పుతిన్ సంచలనం

రష్యా ఉక్రెయిన్ యుద్దంలో మునిగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వారి తరలింపు కొనసాగుతోంది. ఇండియాకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులు ఉన్నారట. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 3 వేల మంది విద్యార్థులు బందీలుగా ఉన్నారని వివరించారు.

 3,000 Indian students were taken hostage in Ukraine: Putin

భారత్‌తో పాటు చైనా విద్యార్థులు కూడా బందీలుగా ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీయులను బందీలుగా ఉంచడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని.. దీంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుందని పుతిన్ తెలిపారు. ఇటు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల తరలింపు ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు 18 నుంచి 20 వేల మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా రంగంలోకి దిగారు. అయితే అంతకుముంద ఓ విద్యార్థి చనిపోగా.. మరో విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మృతిచెందాడు.

ఇటు కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఖర్కివ్‌లో స్టోర్‌‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌.. మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబసభ్యులతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫోన్‌‌లో మాట్లాడారు.

Recommended Video

    Russia Ukraine Conflict : Russian Space Rocket Removed US, UK & Japan Flags | Oneindia Telugu

    ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదేశాల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిన్ననే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు సీ-17 విమానాల‌ను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు స‌హ‌క‌రించాల‌ని అటు ఉక్రెయిన్‌తో పాటు ఇటు ర‌ష్యాను కోరాల‌ని విదేశాంగ శాఖ‌కు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్ప‌టికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు ప్రారంభించింది. అయినప్పటికీ బందీలుగా ఉన్నారని పుతిన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిపాదించారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+