పాకిస్థాన్‌లో పేలుడు, 30 మందికి గాయాలు
పాకిస్తాన్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకొన్న పేలుడు ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్లాన్‌లోని లాహోర్‌లో గల బండ్ రోడ్డులో ఈ పేలుడు సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ళ కిటీకీలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు.

ఓ ట్రక్కులో పేలుడు పదార్దం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
పేలుడు పదార్థాలను తరలించేందుకు ట్రక్కును ఉపయోగించారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు కారణంగా విద్యుత్ స్థంబాలు , విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications