కాసినో రిసార్ట్స్‌లో కాల్పులు: 36మంది మృతి, పలువురికి గాయాలు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న కాసినో రిసార్ట్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం చోటుచేసుకుంది. మనీలా ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న కాసినో రిసార్ట్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.
దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావించడం లేదని వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. రిసార్ట్స్ వరల్డ్ క్యాసినోలో శుక్రవారం తెల్లవారుజామున ముసుగు ధరించిన ఓ వ్యక్తి పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. టేబుళ్లకు నిప్పుపెట్టి, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు.
మరికొందరు బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి దూకేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. టేబుల్స్‌కు నిప్పుపెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరై ఎక్కువ మంది మృతి చెందినట్లు తెలిసింది. తొలుత ఈ ఘటనను ఉగ్రవాదుల దాడిగా భావించినా.. ఆ తర్వాత కాదని పోలీసులు తేల్చారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications