వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోకా కోలా ప్లాంట్ లో 370 కేజీల కొకైన్ సీజ్

|
Google Oneindia TeluguNews

లండన్: కోకా కోలా ప్లాంట్ లో 370 కేజీల కొకైన్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ కార్మికుల పాత్ర లేదని ఫ్రాన్స్ పోలీసు అధికారుల విచారణలో వెల్లడి అయ్యింది.

దక్షిణ ఫ్రాన్స్ లోని సైనెస్ నగరం వద్ద కోకా కోలా ప్లాంట్ ఉంది. ప్లాంట్ లో పని చేస్తున్న కార్మికులు అక్కడ ఉన్న కంటెయినర్ లో పరిశీలించారు. అనేక బ్లాగులలో ఉన్న కొకైన్ గుర్తించి ప్లాంట్ అధికారులకు సమాచారం ఇచ్చారని స్థానిక మీడియా సంస్థ ఇండిపెండెంట్ వెల్లడించింది.

370 Kg cocaine found at Coca Cola plant in France

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు కోకా కోలా ప్లాంట్ దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కంటెయినర్ లో ఉన్న 370 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని, మార్కెట్ లో దాని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని విచారణాధికారి జీన్ డెనిస్ మల్ గ్రాస్ చెప్పారు.

కోకా కోలా ప్లాంట్ కార్మికులకు, సిబ్బందికి ఈ కొకైన్ తో సంబంధం లేదని అన్నారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్ లో కొకైన్ ఉందని ఆయన వివరించారు.

ఫ్రాన్స్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో కొకైన స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. కొకైక్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The drug, hidden in bags among a delivery of orange juice concentrate, arrived in a container from South America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X