యూఎస్-ఎన్ఏఈలో నలుగురు భారత అమెరికన్లు

వాషింగ్టన్‌: ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ సాంకేతిక అకాడమీ(ఎన్‌ఏఈ)లో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. సమాజానికి విలువైన సేవలనందించేందుకు తాజాగా 80 మందికి అకాడమీ అవకాశం కల్పించింది. వీరిలో భారతీయ అమెరికన్లయిన అనీల్‌ కె జైన్‌, డాక్టర్‌ ఆరతి ప్రభాకర్‌, గణేశ్‌ ఠాకూర్‌, డాక్టర్‌ ఆర్‌కె శ్రీధర్‌ పేర్లు కూడా ఉన్నాయి.

మంగళవారం సమావేశం అనంతరం అకాడమీ ఈ పేర్లను వెల్లడించింది. మిచిగన్‌ స్టేట్‌ వర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జైన్‌కు.. ఇంజిరింగ్‌, బయోమెట్రిక్‌ విభాగాల్లో విశేష కృషి చేసినందుకు ఈ అవకాశం దక్కింది.

4 Indian-Americans Selected To US National Academy Of Engineering

రక్షణ అధునాతన పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్‌పీఏ) డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆరతి.. అధునాతన సూక్ష్మ వాహకత, సమాచార సాంకేతికత విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఠాకూర్‌ సర్వీసెస్‌ ఐఎన్‌సీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గణేష్ ఠాకూర్.. జలాశయ సమగ్ర నిర్వహణ విధానాలను విజయవంతంగా అమలుచేసి అకాడమీలో చోటు సంపాదించారు. బ్లూమ్‌ ఇంధన కార్పొరేషన్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడైన శ్రీధర్‌.. రవాణా రంగం, శుద్ధ ఇంధన విభాగాల్లో సేవలందించారు. వీరు అందిస్తున్న సేవలకు గుర్తింపు అమెరికా ఎన్ఏఈలో స్థానం దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+