వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

450 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్‌షీర్ అలయెన్స్ సైన్యం, అమ్రుల్లా సలేహ్ ఎక్కడ?

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. ఆ దేశంలోని పంజ్‌షీర్ ప్రాంతాన్ని మాత్రం దక్కించుకులోకపోతున్నారు. పంజ్‌షీర్ ప్రాంతంపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నా నార్తెర్న్ అలయెన్స్ దళాలు లొంగడం లేదు.

తమ సరిహద్దుల్లోకి రాకముందే తాలిబన్లను ఆప్ఘన్ దళాలు మట్టుబెడుతున్నాయి.
తాలిబన్లకు ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాదులు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. అలయెన్స్ దళాలపై పైచేయి సాధించలేకపోతున్నాయి. ఇప్పటికే వందలాది మంది తాలిబన్లను మట్టుబెట్టిన అలయెన్స్ దళాలు.. వందలాది ఉగ్రవాదులను బంధీలుగా చేసుకున్నాయి.

 450 taliban militants eliminated: Amrullah Saleh says he has not fled Afghanistan

శత్రుదుర్భేధ్యంగా ఉండే పంజ్‌షీర్ కొండల ప్రాంతంలోకి వెళ్లాలంటే తాలిబన్లు హడలిపోతున్నారు. ఉగ్రవాదుల మద్దతుతో దాడులు చేస్తున్నాయి తాలిబన్ బలగాలు. తాజాగా, పంజ్‌షీర్ సైన్యం జరిపిన దాడుల్లో 450 మందికిపైగా తాలిబన్లు హతమైనట్లు సమాచారం. మరో వంద మందికిపైగా తాలిబన్లను సైన్యం బంధీలుగా చేసుకున్నట్లు తెలిసింది.

పంజ్‌షీర్ వ్యాలీలోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు పేల్చేస్తున్న దృశ్యాలు బయటకువచ్చాయి. పంజ్‌షీర్ పై పట్టు సాధిస్తున్నట్లు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ సైన్యం ప్రకటించింది. కాగా, తాలిబన్లకు ఆల్ ఖైదా ఉగ్రవాదులతోపాటు ఐఎస్ ఉగ్రవాదులు, పాక్ మద్దతు పలుకుతుండటం గమనార్హం.

కాగా, తాను దేశం విడిచిపారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆప్ఘానిస్థాన్ అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ స్పష్టం చేశారు. పంజ్‌షీర్ కు అన్ని రకాల రాకపోకలపై నిషేధం విధించారు. ఫోన్ సిగ్నళ్లు, విద్యుత్ సరఫరా, చివరకు వైద్య సంబంధిత సామాగ్రిని కూడా నిలిపివేశారని సలేహ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తమ ప్రాంతానికి ఆహార పదార్థాలను రాకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారని చెప్పారు.

23 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ మొదలైనప్పటి నుంచి కూడా తాలిబన్లకు అత్యవసర వైద్య సదుపాయాలను తాము నిలిపివేయలేదని తెలిపారు. తాలిబన్లు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. అయితే, తాజా ట్వీట్లు అమ్రుల్లా సలేహ్ దేశం విడిచిపోయారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఆ ప్రాంతంలో తాలిబన్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో ఆయన ఇక్కడే వుంటే సోషల్ మీడియాలో పోస్టులు ఎలా చేయగలుగుతున్నారని స్థానిక మీడియా అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

ఇది ఇలావుండగా, తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వానికి అబ్దుల్ ఘనీ బరాదార్ సారథ్యాన్ని వహించే అవకాశాలు ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముల్లా బరాదర్ పేరు వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా ముల్లా బరాదర్.. బాధ్యతలను స్వీకరించడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. కాందహార్ సమావేశాల్లోనే ఈ దిశగా ఓ నిర్ణయానికి వస్తారని, అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కాని, ముల్లా యాకూబ్, రాహ్బరి షురా వంటి కీలక నేతల సమక్షంలో బరాదర్ ఎంపిక జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ముల్లా బరాదర్.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం పొలిటికల్ వింగ్ అధిపతిగా వ్యవహరిస్తోన్నాడు. అతణ్ని అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెజ్కీలతో కలిసి ముల్లా బరాదర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని విదేశీ మీడియా అంచనా వేస్తోంది. ఈ ముగ్గురూ కూడా ఇదివరకు కాందహార్‌లో ఉండేవారని, తాజాగా వీరంతా కాబుల్‌కు చేరుకున్నట్లు తెలిసింది.

English summary
450 taliban militants eliminated: Amrullah Saleh says he has not fled Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X