57 మంది మృతి.. పడవ బోల్తా పడటంతో.. 18 మంది సేఫ్.. ఎక్కడ అంటే
శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 57 మంది మృతి చెందారని యూఎన్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. లిబియా పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి పడవ ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నారని అల్‌జజీరా రిపోర్ట్ చేసింది. 18 మందిని ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నారని మెహ్లీ తెలిపారు.
నైజీరియా, ఘనా, గాంబియా దేశాలకు చెందిన వారు చనిపోయారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయిందని సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తా పడిందని అల్‌జజీరా తన కథనంలో పేర్కొంది. మృతుల్లో 18 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యూరప్‌లో మెరుగైన జీవితం కోసం శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల ద్వారా వలస వెళ్తున్నారు. మరో 500 మంది వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు.

Recommended Video
ఇటీవల లిబియా నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో 15 వేల మంది శరణార్థులను ఈయూ మద్దతు గల లిబియా కోస్ట్‌గార్డ్ అడ్డుకున్నారు. ఈ మొదటి ఆరు నెలలు సముద్రం మీదుగా వలస వెళ్తున్న అడ్డుకొని 7వేల మందికిపైగా లిబియాలోని నిర్బంధ శిబిరాలకు బలవంతంగా తరలించారు. 2011 తిరుగుబాటు తర్వాత నుంచి పడవల ద్వారా జనం యూరప్‌కు వలస వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications