5జీ నెట్ వర్క్: లోగో వచ్చేసింది.. 2018 నుంచి అధికారికంగా...
మొబైల్ నెట్ వర్క్, కమ్యూనికేషన్ రంగంలో ఇప్పటి వరకు మనం 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలను చూశాం. అయితే అతి త్వరలో 5జీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రానుంది.
వాషింగ్టన్: మొబైల్ నెట్ వర్క్, కమ్యూనికేషన్ రంగంలో ఇప్పటి వరకు మనం 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలను చూశాం. ఈ క్రమంలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే 4జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంది.
అయితే అతి త్వరలో 5జీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రానుంది. 2017 ద్వితీయార్థంలో ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఈ 5జీ నెట్ వర్క్ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది.

ఇందులో భాగంగానే మొబైల్ నెట్ వర్క్ టెక్నాలజీలను రూపొందించి, నిర్వహించే థర్డ్ జనరేషన్ పార్ట్ నర్ షిప్ ప్రాజెక్ట్ (3జీపీపీ) తాజాగా 5జీ టెక్నాలజీకి చెందిన లోగోను కూడా విడుదల చేసింది.
2018 నుంచి 5జీ నెట్ వర్క్ అధికారికంగా లభించే అవకాశం ఉండగా, 2020 నాటికి ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. మరి ఇది మన దేశం వరకు రావాలంటే ఆపైన ఎన్నేళ్లు పడుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications