ఘోర విషాదం.. పడవ బోల్తా పడి 68 మంది మృతి, 74 మంది గల్లంతు !

యెమెన్ సముద్రతీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం గల్ఫ్ దేశాలవైపు బయలుదేరిన 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ పడవ అదుపుతప్పి దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ వద్ద అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా.. 74 మంది గల్లంతయ్యారని సమాచారం. ఇప్పటి వరకు 12 మందిని ప్రాణాలతో రక్షించారు. వారిలో 9 మంది ఇథియోపియన్ జాతీయులు కాగా.. ఒకరు యెమెన్‌కు చెందినవారు అని అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని మృతదేహాలు తీరానికి కొట్టుకువస్తుండటంతో ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొన్ని మృతదేహాల కోసం ఇప్పటికీ గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన వలసదారుల భద్రతపై మరోసారి ప్రపంచం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. అపాయంగా మారిన వలస మార్గాలను మరింత గట్టిగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని హ్యుమన్ రైట్స్ సంస్థలు కోరుతున్నాయి.

68-people-died-and-74-people-are-missing-after-a-boat-capsized-in-yemen

కాగా ఈ దారిలో ప్రయాణించడం ప్రమాదకరమని.. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) అనేకసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ తీవ్ర ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరత, కరవు, అంతర్యుద్ధాలు వంటి కారణాలతో ఇథియోపియా, సోమాలియా, ఎరిట్రియా లాంటి దేశాల ప్రజలు.. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు వలస వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.

IOM గణాంకాలు..

2025లో ఇప్పటివరకు 60,000 మందికి పైగా వలసదారులు ఈ మార్గం ద్వారా యెమెన్‌కు ప్రయాణించారు

2024లో - ఇదే మార్గంలో 558 మంది వలసదారులు మృతి చెందారు

గత 10 సంవత్సరాల్లో - మొత్తం 2,082 మంది వలసదారులు కనిపించకుండా పోగా, వీరిలో 693 మంది మునిగిపోయినట్లు ధృవీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+