తూర్పు ఇండోనేషియాలో భూకంపం, 7.3గా నమోదు
న్యూఢిల్లీ: తూర్పు ఇండోనేషియాలోని మలుకు దీవుల్లో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. సముద్రంలో 46 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం కారణంగా ఇండోనేషియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా, ఫిలిప్సేన్స్, జపాన్, తైవాన్, దక్షిణ ఫసిఫిక్ దీవులకు సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సంస్ధ పేర్కొంది.
కాగా భారత్‌కు ప్రస్తుతం సునామీ హెచ్చరికలు లేవని ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ నేషనల్ సెంటర్(ఇన్‌కాయిస్) తెలిపింది. భారత్‌కు చాలా దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది.
ఐతే ఇండోనేషియాలో ఈ ఉదయం వచ్చిన భూకంపం కారణంగా అతి చిన్న సునామీ అల మాత్రమే ఏర్పడిందని, దీని ప్రభావం ఏమీ ఉండదని అ దేశ వాతావరణ విభాగం ప్రకటించింది.
సముద్రంలో 9 సెంటీమీటర్ల సునామీ అల పుట్టి జైలోలో అనే దీవి వైపు వెళ్లిందని, ఎటువంటి ప్రమాదమూ జరగలేదని తెలిపింది. అయితే మిగతా దీవులను ఎత్తైన అలలు తాకవచ్చని వివరించింది.
కాగా 2004లో ఇదే ప్రాంతంలో ఏర్పడిన భూకంపం, ఆపై వచ్చిన సునామీ కారణంగా 12 దేశాల్లోని 2.5 లక్షల మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications