పాక్: ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి: బీఏపీ నేతతోపాటు 133 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నేషనలిస్ట్ బలూచిస్థాన్ ఆవామీ పార్టీ (బీఏపీ) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్ రాష్ట్రంలోని మస్తుంగ్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆత్మాహుతి బాంబు పేలింది.
ఈ ఘటనలో బీఏపీ అగ్రనేత నవాబ్ జదా సిరాజ్ రైసాని మృతి చెందారు. కాగా, బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి నవాబ్ అస్లామ్ రైసాని సోదరుడే సిరాజ్ రైసాని.

రైసానితోపాటు 133 మంది మృతి చెందగా, 100 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు బలూచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫయాజ్ కకార్ తెలిపారు.












Click it and Unblock the Notifications