Greece: గ్రీస్‍లో ఘోర పడవ ప్రమాదం.. 78 మంది మృతి..
గ్రీస్ లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 78 మంది చనిపోయారు. అయితే చాలా మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. గ్రీస్ నైరుతి తీరానికి దాదాపు 50 నాటికల్ మైళ్ల దూరంలో పడవ బోల్తా పడిన ప్రాంతంలో కోస్ట్ గార్డులు గాలిస్తున్నారు. ఓ పడవలో లిబియా నుంచి శరణార్థులు ఇటలీ వెళ్తున్న క్రమంలో గ్రీస్ సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. గ్రీస్ కోస్ట్ గార్డులు ఇప్పటికి 104 మందిని రక్షించారు.
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 750 మంది ప్రయాణిస్తున్నారు. 104 మందిని రక్షించగా.. 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 182 మంది పోను 550 మందికిపైగా గల్లంతనట్లు తెలుస్తోంది. ఈ పడవలో 100 మంది చిన్నారులు కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది. గల్లంతు అయిన వారు బతికే అవకాశం లేదని కోస్ట్ గార్డులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య 600 దాటే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు.

మామూలుగా చేపలు పట్టే పడవల్లో 500 నుంచి 700 ప్రయాణిస్తారని ఓ అధికారి తెలిపారు. అయితే ఇలాంటి పడవల్లో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బయటపడిన వారు ఈజిప్టు, సిరియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, పాలస్తీనాకు చెందిన పౌరులు ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఈ ఘోర ప్రమాదానికి సంతాపంగా గ్రీస్ ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ప్రమాదంలో నెదర్లాండ్స్‌కు చెందిన ఒక సిరియన్ వ్యక్తి తన భార్య, బావ తప్పిపోయినట్లు చెప్పాడు. "అధికారులు సముద్రంలో వారి మృతదేహాలను వెతుకుతున్నారు. వారు ఆసుపత్రులలో చూస్తున్నారు, వారు మృతదేహాల మధ్య, ప్రాణాలతో ఉన్నవారి మధ్య చూస్తున్నారు" అని కస్సం అబోజీద్ అనే వ్యక్తి చెప్పాడు.
ఆసియా దేశాల్లో సంక్షోభం, హింస కారణంగా చాలా మంది పొట్టచేత పట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వలసవెళ్లేవారికి గ్రీస్ దేశం యూరప్ యూనియన్ లోకి గేట్ వేగా మారింది. భారీ గాలులు వీడయంతో పడవ బోల్తా పడినట్లు చెబుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications