విషాదం: మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట: ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నిర్వహించిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మందికిపైగా గాయపడ్డారు. మరికొంత మంది తీవ్రగాయాల పాలయ్యారు. టెక్సాస్ లోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని హూస్టన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.. అయితే, స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జనం వేదిక వైపు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

8 మంది మృతిచెందారు.. గాయపడిన మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించగా.. వీరిలో 11 మంది గుండె నొప్పి వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌కు 50 వేల మంది వరకు సంగీతాభిమానులు హాజరు కాగా.. సుమారు 300 మంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం.
వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు మరనాలకు కారణాన్ని నిర్ధారించలేమని అక్కడి అధికారులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. వీడియో ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని హ్యూస్టన్ పోలీసులు వెల్లడించారు. దీంతో శనివారం కూడా కొనసాగాల్సిన మ్యూజిక్ ఫెస్టివల్‌ను రద్దు చేశారు అధికారులు.












Click it and Unblock the Notifications