పెషావర్‌లో పేలుడు: జర్నలిస్టుతోపాటు 11మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. జమ్రూద్ ఖైబర్ ఏజెన్సీ కర్ఖానో మార్కెట్ ప్రాంతంలో చెక్ పోస్టు సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం 11మంది మృతి చెందగా, మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు వివరాలను హయతాబాద్ మెడికల్ కాంప్లెక్స్ అధికారులు తెలిపారు. ఓ చిన్నారితోపాటు నలుగురు భద్రతాధికారులు కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు. జమ్రూద్ ఖసదార్ లైన్ అధికారి నవాబ్ షా కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు సమాచారం.

మోటర్ బైక్‌లో బాంబు పెట్టి పేల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇది ఆత్మాహుతి దాడా? లేక రిమోట్‌తో బాంబును పేల్చారా? అనేది తేలాల్సి ఉంది. బాంబు పేలుడుతో భారీ మంటలు వ్యాపించాయి.
దీంతో అక్కడ కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. ఆజ్ టీవీ జర్నలిస్ట్ మెహబూబ్ షా అఫ్రిదీ కూడా ఈ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందాడు. కాగా, గతంలో పెషావర్‌లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 150మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications