వామ్మో.. ఇరాన్ 8 శాతం ఎంపీలకు కరోనా పాజిటివ్.. 290 మంది ఎంపీల్లో వీరికి...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత ఎక్కువ మంది చనిపోయింది ఇరాన్‌లోనే.. అయితే 8 శాతం మంది ఇరాన్ ఎంపీలకు వైరస్ సోకిందనే కఠోర సత్యాన్ని 'సీఎన్ఎన్' రిపోర్ట్ చేసింది. ప్రజాప్రతినిధుల ద్వారానే వైరస్ వ్యాపిస్తోందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ప్రజలతో కలువొద్దని ఇరాన్ డిప్యూటీ స్పీకర్ నేతలను కోరారు.
ఇరాన్ దేశంలో గల 8 శాత మంది పార్లమెంటరీయన్లకు వైరస్ సోకిందని అక్కడ 'వైజేసీ' కథనం ప్రసారం చేసిందని సీఎన్ఎన్ పేర్కొన్నది. అయితే ఎంపీలకు వైరస్ ఎప్పుడూ, ఎక్కడ, ఎలా సోకిందనే అంవాన్ని డిప్యూటీ స్పీకర్ అబ్దుల్ రెజా మిస్ర్తరీ పేర్కొనలేదు. ఇరాన్ పార్లమెంట్‌లో 290 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 23 మంది ప్రజాప్రతినిధులకు వైరస్ ప్రబలింది. దీంతో వారు ప్రజలతో కలువకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

కరోనా వైరస్ వ్యాపించకుండా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇరాన్ నేత ఆయతుల్లా అలీ ఖామెనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు వైద్యాధికారులు సూచించిన నిబంధనలను పాటించాలని స్పష్టంచేశారు. సోమవారం ఒక్క ఉన్నతాధికారి చనిపోవడం పరిస్ధితి తీవ్రతకు అద్దంపట్టింది. అన్ని ప్రభుత్వ విభాగాలు.. వైద్యారోగ్య శాఖకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని అలీ కోరారు.












Click it and Unblock the Notifications