రష్యాలో కూలిన అపార్ట్ మెంట్: 9 మంది మృతి, మరొకరి కోసం గాలింపు
రష్యాలో గల ద్వీపం సఖాలిన్‌లో గల ఓ అపార్ట్ మెంట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరొకరి కోసం గాలింపు చర్యలను చేపడుతున్నారు. అత్యవసర విభాగం గాలింపు చేపడుతుందని వివరించారు.
అపార్ట్ మెంట్‌లో గ్యాస్ వల్ల పేలుడు జరిగిందని తెలిసింది. 20 లీటర్ల గ్యాస్ సిలిండర్ వంట చేసే స్టౌవ్‌కు కనెక్ట్ అయ్యింది. ఏం జరిగిందో స్పష్టంగా తెలియలేదు. కానీ అదీ ఒక్కసారిగా పేలింది. దీంతో భవనం కుప్పకూలింది. అక్కడ భీతవాహ వాతావరణం నెలకొంది.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మరొకరి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏం జరిగిందనే అంశంపై విచారణ జరుగుతుందని.. నిజ నిజాలు తెలుస్తాయని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ పేర్కొంది.












Click it and Unblock the Notifications