బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం!

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి బాంబు పేలుడు కలకలం రేపింది. మంగళవారం వాయవ్య పాకిస్థాన్‌లోని లక్కీ మార్వత్ జిల్లాలో రద్దీగా ఉండే ఓ బజారులో రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర పేలుడులో మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసు అధికారులు ఓ మహిళ ఉన్నారని స్థానిక పోలీసు అధికారి అజ్మత్ ఉల్లా ధ్రువీకరించారు.

ఈ దారుణానికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రాంతంలో పాకిస్థానీ తాలిబన్లుగా పిలువబడే తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో ఈ దాడి వెనుక వారి హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉండే ఈ గ్రూప్.. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా దళాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది.

9 Killed in Pakistan Rickshaw Blast Explosion Rocks Khyber Pakhtunkhwa Lakki Marwat Bazaar Details

ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందే బన్నూ జిల్లాలోని సెక్యూరిటీ పోస్ట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసు అధికారులు మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ ఉగ్రదాడులతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్ భూభాగం నుంచే ఈ దాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా.. ఆఫ్ఘనిస్థాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో ఉగ్రవాద హింస విపరీతంగా పెరిగింది. దీనివల్ల పొరుగు దేశాలైన పాక్, ఆఫ్ఘన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరిగినప్పటికీ.. సరిహద్దుల్లో ఘర్షణలు, ఇలాంటి బాంబు పేలుళ్లు కొనసాగుతూనే ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్యే ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+