Pakistan: పాకిస్థాన్‍లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది హత్య..
పాకిస్థాన్ లో దారుణం జరిగింది. ముష్కరులు ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మలాకాండ్ జిల్లాలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సభ్యులను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. సాయుధ దుండగులు రాత్రి కుటుంబ సభ్యుల ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, పిల్లలు చనిపోగా, 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. కుటుంబానికి చెందన సొంత అల్లుడు కాల్పుల్లో పాల్గొన్నాడని, మరణించిన తొమ్మిది మంది వ్యక్తులలో అతని భార్య కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనకు వివాహ వివాదమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

హత్యాకాండకు వ్యతిరేకంగా మలకాండ్ వాసులు బాధితుల మృతదేహాలను రోడ్డు మధ్యలో ఉంచి ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా .. వారు వినలేదు. దీంతో స్థానిక పోలీసులు ఆందోళనకారులను చెదరగోట్టారు. మరోవైపు పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ నుంచి నిధులు సమీకరించడానికి ప్రయత్నం చేస్తోంది.
IMF షరతులను నెరవేర్చడానికి పాకిస్తాన్ చివరి ప్రయత్నం చేస్తోందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. దీని కోసం పాకిస్తాన్ పన్ను ద్వారా 215 బిలియన్లు వసూలు చేస్తుందన్నారు. IMFతో చర్చలు జరిగాయని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం రూ. 215 బిలియన్లు లేదా దాదాపు US $ 750,400,000 మాత్రమే తుది పన్నుగా నిర్ణయించామని దార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications