వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిట్ట కొంచెం.. కూత ఘనం, తొమ్మిదేళ్లకే డిగ్రీ పట్టా..?, నెక్ట్స్ పీహెచ్‌డీ, ఆపై మెడిసన్,

|
Google Oneindia TeluguNews

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత తెలిసే ఉంటుంది. చిన్న పిట్ట అయినా గట్టిగా అరవడంతో ఈ సామెత వాడుతుంటాం. దీనిని ప్రతిభ చూపే సమయంలో కూడా పోలుస్తాం. చిన్న పిల్లలు.. తమ జ్ఞాపకశక్తితో పేర్లు, నగరాల చెప్పడంతో అబ్బురపడిపోతాం. కానీ తొమ్మిదేళ్లకే ఓ బుడతడు డిగ్రీ పట్టా అందుకోబోతున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. వచ్చే నెలలో లారెంట్ సైమన్స్ అనే చిన్నారి డిగ్రీ పట్టా స్వీకరించబోతున్నాడు.

తొమ్మిదేళ్లకే..

తొమ్మిదేళ్లకే..

లారెంట్ సైమన్స్ వయస్సు తొమ్మిదేళ్లు. అతని తల్లిదండ్రులది బెల్జియం, డచ్.. చిన్నారిలో ప్రతిభ అపారం. ఈ విషయాన్ని తాతయ్య, నానమ్మ చిన్పప్పుడే గుర్తించారు. దీంతో అతని పేరెంట్స్ అతని ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా చదివించారు. అలా పాఠశాల విద్యను 8 ఏళ్ల ప్రాయంలోనే పూర్తిచేసి ఔరా అనిపించారు. తర్వాత అతను నెదర్లాండ్‌లోని ఐండ్‌హోవెన్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరంగ్ గ్రాడ్యుయేషన్ కోసం చేరాడు.

ఏడాదిలోనే..

ఏడాదిలోనే..

సాధారణంగా డిగ్రీ మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. కానీ మన బుడతడు కంప్యూటర్‌తో పోటీ పడుతుండటంతో అతని గ్రాడ్యుయేషన్ ఏడాదిలో పూర్తవబోతోంది. డిసెంబర్‌లో లారెంట్ డిగ్రీ పూర్తవబోతుంది. దీంతో ప్రపంచంలోనే పిన్న వయస్సులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన జాబితాలో చేరబోతున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు మైఖేల్ కెర్నీ పేరుతో ఉంది. అతను పదేళ్లలో అలాబన వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. అతనిని మించి లారెంట్.. ఏడాది ముందే డిగ్రీ పూర్తిచేయబోతున్నారు.

ఐక్యూ 145

ఐక్యూ 145

లారెంట్ ఐక్యూ 145 ఉందని టెలీగ్రాప్ కొట్ చేసింది. అందుకోసమే అతను తన పాఠశాల విద్యను అంత త్వరగా పూర్తి చేయగలిగారని పేర్కొన్నది. అంతేకాదు వర్సిటీలో కూడా డిగ్రీ కోసం చేరిన పిన్న వయస్కుడు లారెంట్ అని తెలిపింది. లారెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్ చేస్తాడని అతని తండ్రి అలెగ్జాండర్ సైమన్స్ తెలిపారు. తర్వాత మెడిసిన్‌లో కూడా గ్రాడ్యుయేషన్ చేస్తాడని తన కుమారుడిని లక్ష్యాన్ని వివరించారు.

 అభీష్టం మేరకే..

అభీష్టం మేరకే..

తమ కుమారుడిలో ప్రతిభను చూసి చాలా విద్యాసంస్థలు, వర్సిటీలు చేర్చుకునేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. కానీ తాము లారెంట్ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తున్నామని స్పష్టంచేశారు. వర్సిటీలో లారెంట్ టాలెంట్ స్వయంగా చూశామని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జోర్డ్ పేర్కొన్నారు. లారెంట్ తెలివైన విద్యార్థే గాక.. సానుభూతి కలిగిన చిన్నారి అని తెలిపారు.

ఇలా గుర్తించారు..

ఇలా గుర్తించారు..

లారెంట్ ప్రతిభను నానమ్మ, తాతయ్య చూసి గుర్తించారని అతని తల్లి లైదియా తెలిపారు. అతనిలో ఏదో అభూత శక్తి కలిగిందని పేర్కొన్నారు. అప్పటినుంచి అతనిని ప్రత్యేకంగా చూసి.. అభిరుచి మేరకు నడుచుకొంటున్నామని తెలిపారు. లారెంట్ కోరిక మేరకు చదివిస్తున్నామని చెప్పారు.

English summary
9-year-old Laurent Simons is all set to become the youngest person to complete a graduation degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X