14 రోజుల్లో 900 సార్లు భూకంపం.. ఎక్కడంటే ?

క్షణక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు అక్కడి ప్రజలు. గంటకు సగటున మూడుసార్లకు పైగా భూమి కంపిస్తుంటే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నారు. ఇటువంటి భయానక పరిస్థితిలోనే ప్రస్తుతం ఉంది జపాన్. ముఖ్యంగా టొకార దీవుల సమూహంలో భూకంపాలు అక్కడి వారిని బెంబేలెత్తిస్తున్నాయి. జూన్ 21వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ భూ ప్రకంపనలు ఇప్పటివరకు తగ్గకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత రెండు వారాల్లోనే ఏకంగా 900 సార్లు భూమి కంపించిందని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఒక్కరోజే 183 సార్లు కంపించిన భూమి..

జూన్ 23న ఒక్కరోజే 183 సార్లు ప్రకంపనలు నమోదవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ రోజు భూమి నిరంతరం కదిలిపోతున్నట్టు అనిపించిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఏ క్షణానేమి జరుగుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే బుధవారం (జూన్ 26, 2025) నాడు 5.5 తీవ్రతతో ఓ భారీ భూకంపం సంభవించింది. వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసినా, ఆ తర్వాత ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వారికి సహాయపడేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.

900-earthquakes-in-14-days-at-japan-and-news-got-viral

టొకార దీవుల్లో మొత్తం 12 దీవులు ఉండగా, వాటిలో కేవలం 7 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. జనాభా సుమారుగా 700 మందికే పరిమితమైనప్పటికీ.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంపాల తీవ్రత దృష్ట్యా ఎప్పుడైనా విపత్తు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు భూకంపాలు జపాన్‌కి కొత్తకాక పోయినా ఇప్పుడు నెలకొంటున్న పరిస్థితులు మాత్రం భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ దేశం పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్'పై ఉండటంతో సంవత్సరానికి సగటున 1,500 భూకంపాలు నమోదు అవుతుంటాయని స్పష్టం చేస్తున్నారు. గతేడాది టొకార దీవుల్లో 346 సార్లు భూమి కంపించినట్టు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+