వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Court Fine: జంతువులను వేటాడినందుకు రూ. కోటి జరిమానా..

|
Google Oneindia TeluguNews

జంతువులను వేటాడడం నేరం.. అనే వేటాడితే శిక్ష వేస్తారు లేదా ఫైన్ విధిస్తారు. జరిమానా విధిస్తే ఎంత విధిస్తారు.. రూ.10 వేలు ఇంకా అంటే రూ.లక్ష మరి ఎక్కువంటే రూ. 10 లక్షలు.. కానీ ఓ చోట జంతువులను వేటాడినందుకు ఓ జంటకు కోటి రూపాయలకు పైన ఫైన్ విధించారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఈ జరిమానా వేటాడినందుకే కాదు.. జంతువులను వేటాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినందుకు కూడా.

జోష్, సారా

జోష్, సారా

జోష్, సారా బౌమర్ జంటకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరు వేటాడం ఎలా, వేటాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి బౌమర్ బౌహంటింగ్ అనే యూట్యూబ్ చానెల్ ఉంది. ఈ ఛానెల్ లో
వేటాడం ఎలా, వేటాడుతున్న వీడియోలు పోస్ట్ చేస్తారు. వీటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీరు సెప్టెంబరు 10, 2015 నుంచి నవంబర్ 6, 2017 మధ్య ఈ జంట దాదాపు 100 జంతువులను చంపినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

లైసెన్స్

లైసెన్స్

వీరు సరైన లైసెన్స్ లేకుండా గన్ ఉపయోగించడం. తెల్ల తోక గల జింకలు, అడవి టర్కీలు, ఇతర జంతువులను ఉద్దేశపూర్వకంగా వెటాడడం చేశారని పోలీసులు చెప్పారు.జనవరి 5, 2017న పోస్ట్ చేసిన ఓ వీడియోలో జోష్ తెల్ల తోక గల జింకను బాణంతో వేటాడాడు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అంతే కాకుండూ వీరు వేటాడిన జంతువులను అక్రమంగా రవాణా చేసే వారని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆస్తి

ఆస్తి

మొత్తం 39 మందిని దోషులుగా తేల్చిన ఒమాహాలోని ఫెడరల్ కోర్టు.. జోష్, సారాకు రూ.1.08 కోట్ల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే ఆస్తిని జప్తు ఆదేశించింది. వీరు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో జోష్ ఎలుగుబంటిని వేటాడాడు.

English summary
A couple has been fined over one crore rupees for poaching animals. This incident happened in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X