Flight: విమానం టాయిలెట్‍లో కెమెరా.. గుర్తించిన బాలిక..!
విమానం ప్రయాణం అంటే ఎన్నే భద్రత చర్యలు తీసుకుంటారు. కానీ విమానం టాయిలెట్ లో కెమెరా పెట్టిన అమెరికాలో జరిగింది. నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్లే విమానంలో టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఐఫోన్ అతికించారు. 14 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఆమెను సిబ్బంది సభ్యుడు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సెప్టెంబరు 2 అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1441 ఓ బాలిక కుటుంబంతో సహా ప్రయాణిస్తుంది. ఇంతలో అమ్మాయికి బాత్ రూమ్ వచ్చింది. ఆమె బాత్ రూమ్ కు వెళ్లే క్రమంలో.. సిబ్బందిలోని ఒక యువకుడు ఇందులో టాయిలెట్ బాగోలేదని.. ఫస్ట్-క్లాస్ బాత్రూమ్‌ను ఉపయోగించమని చెప్పాడు. సీటు విరిగిపోయిందని, అయితే దాని గురించి చింతించవద్దని ఆమెకు వివరించాడు. దీంతో సదరు బాలిక్ బిసినెస్ క్లాస్ లోని టాయిలెట్ కు వెళ్లింది.

టాయిలెట్ ముగించుకు తర్వాతా అందులో ఓ ఫోన్ అతకించబడి కనిపించింది. దీంతో వెంటనే ఆ బాలిక ఆ ఫోన్ ను ఫొటో తీసింది.టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత, టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఎక్కువగా అస్పష్టంగా ఉన్న ఐఫోన్‌ను అతికించారని, దానిని రికార్డ్ చేయడానికి పెట్టారని బాలిక గ్రహించింది. ఆమె బాత్రూమ్ నుండి బయలుదేరే ముందు తన స్వంత ఫోన్‌తో దీన్ని చిత్రీకరించింది.
"ఈ సంఘటనలు మా కుమార్తెను -మొత్తం కుటుంబాన్ని - దిగ్భ్రాంతికి గురి చేశాయి. తీవ్ర కలత చెందాయి" అని కుటుంబం ఒక ప్రకటనలో రాసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత గేట్ వద్ద లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంఘటన తర్వాత ఒక ప్రకటనలో ఎయిర్‌లైన్స్ అధికారులు "ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. భద్రత మా అత్యధిక ప్రాధాన్యతలు కాబట్టి వారి దర్యాప్తులో చట్ట అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారు" అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications