వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు మద్దతిచ్చే శక్తివంతమైన దేశమే నాపై కుట్రలు చేస్తోంది: ఇమ్రాన్ ఖాన్ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అగ్రదేశం అమెరికాపై విమర్శలు గుప్పించారు. తాను రష్యాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసిన తర్వాత అమెరికా.. పాకిస్థాన్ కోపంగా ఉందని, భారతదేశానికి మద్దతు పలికే ఈ దేశం తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని యూఎస్ ఛార్జ్ డి'అఫైర్స్‌ను పిలిపించి, దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యూఎస్ ప్రయత్నంపై సమన్లు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అందుకే పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహం: ఇమ్రాన్ ఖాన్

అందుకే పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహం: ఇమ్రాన్ ఖాన్


శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ స్వాతంత్ర్యత కలిగిన విదేశాంగ విధానాన్ని కలిగి ఉందని, అలాంటప్పుడు ఏ శక్తివంతమైన దేశం చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలని అమెరికానుద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడంపై శక్తివంతమైన దేశం(అమెరికా).. పాకిస్థాన్‌పై కోపంగా ఉందన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌ను మాత్రం ఏమి అనడం లేదన్నారు.

తనను తొలగించాలని ఒక దేశం సందేశం: అంటూ అమెరికాపై ఇమ్రాన్

తనను తొలగించాలని ఒక దేశం సందేశం: అంటూ అమెరికాపై ఇమ్రాన్

ఉక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య"కు మాస్కో ఆదేశించిన ఒక రోజు తర్వాత, ఫిబ్రవరి 24న పాకిస్థాన్ ప్రధాని రష్యాను సందర్శించి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం, తన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తనను తొలగించాలని ఒక విదేశీ దేశం సందేశం పంపిందని, విఫలమైతే పాకిస్థాన్ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు.

విదేశీ కుట్ర అంటూ బైడెన్ సర్కారుపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు

విదేశీ కుట్ర అంటూ బైడెన్ సర్కారుపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు

తన స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగా తనపై "విదేశీ కుట్ర" అని కూడా ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. తనను అధికారం నుంచి తొలగించడానికి విదేశాల నుంచి నిధులు మళ్లించబడ్డాయని పేర్కొన్నారు. తనను అధికారం నుంచి దింపేందుకు బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇమ్రాన్‌ అధికారంలో కొనసాగితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం నాడు నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంతో పాకిస్థాన్‌లో ఖాన్ ప్రభుత్వం పతనం అంచున ఉంది. దాని కీలక భాగస్వామి ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ (MQM-P) ప్రతిపక్ష శ్రేణిలో చేరిన తర్వాత 69 ఏళ్ల ప్రధాని పార్లమెంటులో మెజారిటీని సమర్థవంతంగా కోల్పోయారు.

ఇమ్రాన్ ఆరోపణలను తిరస్కరించిన అమెరికా

ఇమ్రాన్ ఆరోపణలను తిరస్కరించిన అమెరికా

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది. వీటిపై అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ స్పందించారు. ఆ ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. పాకిస్థాన్‌లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. అక్కడి రాజ్యాంగ విధానాలకు, చట్టానికి తమ దేశం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకమయ్యాయి. ఫలితంగా 342 మంది ఉన్న పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో అవిశ్వాసం వీగిపోవాలంటే 172 ఓట్లు ఇమ్రాన్‌కు అవసరం. కానీ, ఆయనకు వ్యతిరేకంగా 196 ఓట్లు ఉన్నాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఖాన్‌ ఓటమి ఖాయమైందని వెల్లడించింది.

English summary
A 'Powerful Nation' Backing India Is Angry With Pakistan: Imran Khan Indirectly Slams US Again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X