అమెరికాలోని కీలక ప్రాంతాలపై.. ర‌ష్యా నిఘా విమానం చక్క‌ర్లు! అదీ అతి తక్కువ ఎత్తులో..!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్ట‌న్‌: అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో ఉన్న ఆ దేశ ర‌క్ష‌ణశాఖ హెడ్‌క్వార్ట‌ర్స్‌ పెంట‌గాన్‌, కాంగ్రెస్ కొలువుదీరే ది కేపిట‌ల్ బిల్డింగ్‌తోపాటు పలు ప్ర‌భుత్వ భ‌వనాల‌పై ర‌ష్యాకు చెందిన నిఘా విమానం బుధ‌వారం చక్క‌ర్లు కొట్టింది.

వాస్త‌వానికి ఇది నిషిద్ధ గ‌గ‌న‌స్థ‌లం. ప్ర‌పంచంలోనే అత్యంత భ‌ద్ర‌తతో కూడిన అమెరికాలోని గ‌గ‌న‌తలంలో ర‌ష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తుపొలెవ్ టీయూ-154ఎం విమానం చక్క‌ర్లు కొట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

A Russian military jet flew over the US Capitol and Pentagon at a low altitude

అయితే ఈ చర్యపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే, 'ఓపెన్ స్కైస్ ఒప్పందం'లో భాగంగా ఇలా రష్యాకు చెందిన విమానం అమెరికా గగనతలంపై కాసేపు సంచరించింది.

ఈ 'ఓపెన్ స్కైస్ ఒప్పందం'పై ర‌ష్యా, అమెరికాతోపాటు 32 దేశాలు సంత‌కం చేశాయి. ఈ ఒప్పందం ప్ర‌కారం... ఓ దేశ నిరాయుధ విమానం మ‌రో స‌భ్య దేశ నిషిద్ధ గ‌గ‌న‌త‌లంలోనూ ఎగిరే అవ‌కాశం ఉంటుంది.

పార‌ద‌ర్శ‌క‌త‌, అంత‌ర్జాతీయ ఆయుధ నియంత్ర‌ణ ప్ర‌క్రియ‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఈ దేశాలు ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నిజానికి బుధ‌వారం ఉద‌య‌మే 'ది కేపిట‌ల్' పోలీసులు ఒక అలర్ట్ జారీచేశారు.

ఉద‌యం 11 గంట‌ల నుంచి మధ్యాహ్నం 3 గంట‌ల మ‌ధ్య‌.. త‌క్కువ ఎత్తులో ఓ విమానం నిషిద్ధ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని తెలిపారు. అదో పెద్ద విమానం అని, అది నేరుగా ది కేపిట‌ల్ బిల్డింగ్ మీదుగా కూడా ఎగురుతుంద‌ని కూడా చెప్పారు.

ఈ ఒప్పందంలో భాగంగానే ర‌ష్యా విమానం ఎగిరిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఆ స‌మ‌యంలో, ఆ విమానంలో అమెరికా ఎయిర్‌ఫోర్స్ కు చెందిన అధికారులు కూడా ఉన్నారు.

అయితే డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌ లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ విన్సెంట్ స్టీవార్ట్ మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈ ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని అమెరికాకు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని ర‌ష్యా సేక‌రిస్తుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Russian surveillance aircraft flew over multiple federal buildings in Washington DC at a low altitude on Wednesday afternoon, according to CNN.The Russian Air Force plane passed over the US Capitol, Pentagon, Joint Base Andrews, CIA, Camp David, and a secret government bunker called Mount Weather, CNN said. The flyby, however, was completely legal and in accordance with the 1992 Treaty on Open Skies, which lets countries that are part of the agreement to surveil the other member countries from the air, Politico reported , citing the State Department.
Please Wait while comments are loading...