
liplock: జైల్లో మౌత్ కిస్ తో చంపేసిన లేడీ, ఆడగాలితో ఆవేశంతో లిప్ లాక్, సినిమా స్టైల్లో హత్య !
వాషింగ్టన్/అమెరికా: విలన్లు పక్కాప్లాన్ తో ప్రత్యర్థులను ముద్దులు పెట్టి చంపేయడం మనం హాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కొన్ని భారతీయ సినిమాల్లోనే చూశాము. అయితే సినిమా స్టైల్లో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వ్యక్తిని హత్య చెయ్యడానికి అతని ప్రత్యర్థులు స్కెచ్ వేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన యువకుడు జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా నోరు విప్పితే మొదటికే మోసం వస్తుందని భయపడినట్లు ఉన్నారు. అందుకే అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉన్న ఆ జైలులో ఆ ఖైదీని హత్య చెయ్యడానికి ప్లాన్ చేశారు. నాజుకుగా ఉన్న లేడీని రంగంలోకి దింపారు. జైల్లోకి వెళ్లిన కిలాడీ లేడీ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఖైదీకి మౌత్ కిస్ పెట్టింది. విరహంతో ఉన్న ఆ ఖైదీ మహిళతో లిప్ లాక్ చేసి ఆవేశంతో ఆమెను గట్టిగా పట్టుకుని విరహంతో రగిలిపోయాడు. అదే సమయంలో ఆమె నోటిలో ఉన్న విషం ఖైదీ నోట్లోకి తోసేయడంతో ఆ ఖైదీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Doute:
లవ్
మ్యారేజ్,
ఇంటి
చుట్టూ
కత్తితో
తిరుగుతూ
భార్యకు
కాపలా,
కొడవలితో
నరికి
స్పాట్
లో
చంపేశాడు
!

డ్రగ్స్ కేసులో అరెస్టు
అమెరికాలో జాషువా బ్రౌన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డ్రగ్స్ తో పాటు నిషేధిత పదార్థాలు సరఫరా చేస్తున్నాడని ఆరోపిస్తూ జాషువా బ్రౌైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కేసు విచారణ చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. జాషువా బ్రౌన్ నేరం చేశాడని వెలుగు చూడటంతో కోర్టు అతనికి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

నాలుగు సంవత్సరాల నుంచి జైల్లోనే
అమెరికాలోని టెన్సీస్ జైలులో జాషువా బ్రౌన్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పూర్తి చేసుకున్న జాషువా బ్రౌన్ ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన జాషువా బ్రౌన్ ను హత్య చెయ్యడానికి అతని ప్రత్యర్థులు స్కెచ్ వేశారు.

జైల్లో భారీ బందోబస్తు
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన జాషువా బ్రౌన్ జైలులో కాలం గడుపుతున్నాడు. జైల్లో ఉన్న జాషువా బ్రౌన్ ఎప్పటికైనా నోరు విప్పితే అసలు నిజం బయటకు వస్తే మొదటికే మోసం వస్తుందని అతని ప్రత్యర్థులు భయపడినట్లు ఉన్నారు. అందుకే అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉన్న ఆ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న జాషువా బ్రౌన్ ను హత్య చెయ్యడానికి ప్లాన్ చేశారు.

వయ్యారిభామతో లిప్ లాక్.... విరహంతో రగిలిపోయిన జాషువా
జైలులో ఉన్న జాషువా బ్రౌన్ ను హత్య చెయ్యడానికి నాజుకుగా ఉన్న రాచెల్ డాలర్డ్ అనే లేడీని రంగంలోకి దింపారు. జైల్లోకి వెళ్లిన రాచెల్ డాలర్డ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఖైదీ జాషువా బ్రౌన్ ను కలిసింది. తరువాత రాచెల్ ఖైదీ జాషూవా బ్రౌన్ కు మౌత్ కిస్ పెట్టింది. నాలుగు సంవత్సరాల నుంచి ఆడగాలి సోకకుండా విరహంతో జాషువా బ్రౌన్ రాచెల్ తో లిప్ లాక్ చేసి ఆవేశంతో ఆమెను గట్టిగా పట్టుకుని విరహంతో రగిలిపోయాడు.

మౌత్ కిస్ తో చంపేసింది....... బెలున్ లో విషం
మౌత్ కిస్ పెట్టిన సమయంలో రాచెల్ ఆమె నోటిలో ఉన్న విషం ఖైదీ జాషువా బ్రౌన్ నోట్లోకి తోసేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాచెల్ బెలున్ లో విషం పెట్టుకుకుని దానిని నోట్లో పెట్టుకుందని, మౌత్ కిస్ పెట్టే సమయంలో ఆ విషం జాషువా బ్రౌన్ నోట్లోకి తోసేసిందని, ఆ బెలున్ ఆకారం మాత్రను జాషువా మింగేయడంతో అతని ప్రాణాలు పోయాయని పోలీసులు అంటున్నారు.

నోటిలో విషం దాచిపెట్టుకుని వెళ్లిన కన్నింగ్ లేడీ
జైల్లోకి వెలుతున్న రాచెల్ ను అక్కడి సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారని, అయితే విషం ఆమె నోటిలో దాచిపెట్టుకోవడంతో జైలు సిబ్బంది గుర్తించలేకపోయారని పోలీసులు అంటున్నారు. డ్రగ్స్ డీలింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న జాషువా బ్రౌన్ ను హత్య చేసిన రాచెల్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.