రేప్,హత్య: రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష
బ్యాంకాక్: బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన రైల్వే ఉద్యోగికి బ్యాంకాక్ న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వాంచాయి సాయింఖావో (23) అనే కిరాతకుడికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
థాయిలాండ్ లో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకాక్ లో నివాసం ఉంటున్న వాంచాయి సాయింఖావో థాయిలాండ్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను స్లీపర్ కోచ్ లలో విధులు నిర్వహించేవాడు.
2014 జులై 5వ తేదిన స్లీపర్ కోచ్ లోకి వెళ్లాడు. తరువాత ఒంటరిగా బెర్త్ మీద నిద్రిస్తున్న 13 సంవత్సరాల బాలికను గుర్తించాడు. బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆమె విషయం బయటకు చెబుతుందని భయపడ్డాడు.

వేగంగా వెళుతున్న రైలులో నుంచి బాలికను కిందకు తోసేశాడు. బాలిక మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇతనిని అరెస్టు చేశారు. ది హువా హిన్ ప్రావిన్సియల్ కోర్టు కేసు విచారించి ఇతనికి ఉరి శిక్ష విధించింది.
అయితే ఇతను కింది కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులో సవాలు చేశాడు. కేసు విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం కిరాతకంగా ప్రవర్తించిన ఇతని మీద కనికరం చూపించవలసిన అవసరం లేదని అంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. త్వరలో ఇతనికి ఉరి శిక్ష అమలు చెయ్యనున్నారు.












Click it and Unblock the Notifications