వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్‌ఖైదా చీఫ్ బ‌తికే ఉన్నాడు-వీడియో సందేశంతో ప్రత్యక్షం : మరణించినట్లుగా ప్రచారం..ఇప్పుడిలా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా. ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా. అదంతా ప్రచారమేనా. ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు..ఆధారాలు అవననే చెబుతున్నారు. చాలా కాలం క్రితమే
చ‌నిపోయాడ‌నుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జ‌వ‌హిరి బ‌తికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జ‌రిగి 20 ఏళ్ల పూర్త‌యిన సంద‌ర్భంగా అత‌డు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. అల్‌ఖైదా అధికారిక మీడియా అస్‌-స‌హ‌బ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది.

ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మ‌ట్టుబెట్టిన త‌ర్వాత అల్‌ఖైదా బాధ్య‌త‌లు తీసుకున్న జ‌వ‌హిరి.. చాలాకాలంగా అండ‌ర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అత‌డు అనారోగ్యంతో మ‌ర‌ణించిన‌ట్లు కూడా వార్తలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అత‌ని నుంచి వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. శ‌నివారం విడుద‌లైన ఈ వీడియోలో జ‌వ‌హిరి పూర్తి ఆరోగ్యంతో క‌నిపించాడు.

సెప్టెంబ‌ర్ 11 ఉద‌యం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్ల‌లో ఈ వీడియో వ‌స్తోందంటూ అస్‌-స‌హ‌బ్ ప్రోమోలు న‌డిపించింది. ఆ త‌ర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జ‌వ‌హిరి రాసిన 852 పేజీల బుక్‌ను రిలీజ్ చేసింది అల్‌ఖైదా. ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్క‌చోట మాత్ర‌మే అత‌డు ఆఫ్ఘ‌నిస్థాన్ గురించి ప్రస్తావించాడు.

Aal-Qaedas official media arm as-Sahab released a 60-minute video statement of Ayman al-Zawahiri

20 ఏళ్ల యుద్ధం త‌ర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మ‌ళ్లీ ఇంటిదారి ప‌ట్టింద‌ని అన్నాడు. 9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల‌ను అత‌డు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నాడు. అదే విధంగా సెప్టెంబర్ 11 దాడులకు 20 ఏళ్లు పూర్తి కావటంలో ఆప్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ భవనం పైన తాలిబన్లు తమ జెండా ఎగురవేసారు.

వాస్తవంగా ఇదే రోజున తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించినా..చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక, తాజా వీడియోలో జవహరితో పాటుగా చాలా మంది జీహాది ఫైటర్లు కనిపించారు.

English summary
Aal-Qaeda's official media arm as-Sahab released a 60-minute video statement of Ayman al-Zawahiri, the group's elusive leader who was rumoured to be dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X